India vs South Africa T20 Series: బుమ్రాతో కష్టం.. భారత బౌలర్‌పై సౌతాఫ్రికా కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
Temba Bavuma About Bumrah: బుధవారం నాడు తొలి టీ20 జరగనున్న సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా విలేకరులతో మాట్లాడాడు. భారత్‌లో కొత్త బంతిని ఎదుర్కోవడం చాలా కష్టమని, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడతామని తెలిపాడు.
Temba Bavuma on Indian team: భారత్‌లో భారత పర్యటన రేపటి నుంచి మొదలు కానుంది. ఇందులో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది. తొలుతు పొట్టి సిరీస్ జరగనుంది. బుధవారం తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ మైదానం వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతుంది టీమిండియా. దీంతో సఫారీలపైనా పై చేయి సాధించాలని ఆశపడుతోంది. బుధవారం నాడు తొలి టీ20 జరగనున్న సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా విలేకరులతో మాట్లాడాడు. భారత్‌లో కొత్త బంతిని ఎదుర్కోవడం చాలా కష్టమని, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడతామని తెలిపాడు.
"భారత్‌లో కొత్త బంతిని ఎదుర్కోవడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. టీమిండియా బౌలర్లు బంతిని బాగా స్వింగ్ చేయగలరు. దక్షిణాఫ్రికాలో మేము అలవాటుపడిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకే తొలుత వికెట్లు కాపాడుకోవడంపై దృష్టి పెడతాం. కొత్త బంతితో బుమ్రాను ఎదుర్కోవడం మాకు పరీక్షే. ఉత్తమ జట్టుతో పడుతున్నాం. ఇందుకోసం మరింత అత్యుత్తమంగా రాణించాల్సి ఉంటుంది." అని దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా స్పష్టం చేశాడు.
క్రితం సారి టీమిండియా నుంచి ఎదురైన పరీక్షలను గట్టిగానే ఎదుర్కొన్నామని బవుమా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. "చివరిసారిగా మేము ఇక్కడ ఆడినప్పుడు పలు పరీక్షలు, సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి గట్టిగానే ఎదుర్కొన్నాం. ఇప్పుడు జరగబోయే సిరీస్‌లోనూ సమర్థవంతంగా ఆడతాం. ప్రపంచకప్ ముందు జరగబోయే ఈ సిరీస్ మా జట్టులోని లోపాలను సరిచేసుకునేందుకు సహాయపడుతుంది" అని భావిస్తున్నాం.
ఈ రెండు జట్లు చివరిసారిగా జూన్‌లో తలపడ్డాయి. ఐదు టీ20ల సిరీస్ 2-2తో సమమైంది. నిర్ణయాత్మక ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో రెండు జట్లు సిరీస్‌ను సమంగా పంచుకున్నాయి. సెప్టెంబరు 28న సౌతాఫ్రికాతో టీమిండియా తొలి టీ20 ఆడనుండగా.. రెండో టీ20 గువహాటీ వేదికగా, మూడో టీ20 ఇండోర్ వేదికగా ఆడనుంది. దీని తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అక్టోబరు 11న చివరి వన్డే జరగనుంది.
సంబంధిత కథనం