Shikhar Dhawan as captain: మళ్లీ కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. కోచ్‌గా లక్ష్మణ్!
Shikhar Dhawan as captain: శిఖర్ ధావన్ మళ్లీ కెప్టెన్‌గా వస్తున్నాడు. అటు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ కూడా తిరిగి టీమిండియా బాధ్యతలు చేపట్టనున్నాడు.
Shikhar Dhawan as captain: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్ మళ్లీ వస్తున్నాడు. ఈ మధ్యే వెస్టిండీస్ టూర్‌లో అతని కెప్టెన్సీలోనే ఇండియా వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అయితే రానున్న సౌతాఫ్రికా వన్డే సిరీస్ కోసం మరోసారి ధావన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు ఏఎన్‌ఐతో చెప్పారు.
టీ20 వరల్డ్‌కప్ ఆడబోయే ప్లేయర్స్‌కు వన్డే సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది వరల్డ్‌కప్ జరగనుంది. ఇక సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ కూడా తిరిగి రానున్నట్లు ఆ అధికారి చెప్పారు. ఈ సిరీస్‌కు రాహుల్ ద్రవిడ్‌కు కూడా విశ్రాంతి ఇవ్వనున్నారు.
ఆసియా కప్ ఫైనల్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టిన టీమిండియా.. సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి సౌతాఫ్రికా సిరీస్ మొదలవుతుంది. మొదట మూడు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డే మ్యాచ్‌లు ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతాయి. సెప్టెంబర్ 28న తిరువనంతపురంలో తొలి టీ20, అక్టోబర్ 2న గౌహతిలో రెండో టీ20, అక్టోబర్ 4న ఇండోర్‌లో మూడో టీ20 ఆడుతాయి.
ఇక అక్టోబర్ 6న తొలి వన్డే లక్నోలో జరుగుతుంది. ఈ సిరీస్‌కే ధావన్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 9, 11 తేదీల్లో రెండు, మూడు వన్డేలు రాంచీ, ఢిల్లీల్లో జరుగుతాయి. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికాతో సొంతగడ్డపై టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. 2-2తో డ్రా అయింది.