Bangar on Kl Rahul: రాహుల్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చోటు ద‌క్క‌డం క‌ష్ట‌మే - మాజీ బ్యాటింగ్ కోచ్ కామెంట్స్‌-sanjay bangar says kl rahul may not be part of odi world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bangar On Kl Rahul: రాహుల్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చోటు ద‌క్క‌డం క‌ష్ట‌మే - మాజీ బ్యాటింగ్ కోచ్ కామెంట్స్‌

Bangar on Kl Rahul: రాహుల్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చోటు ద‌క్క‌డం క‌ష్ట‌మే - మాజీ బ్యాటింగ్ కోచ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 02, 2023 06:12 PM IST

Bangar on Kl Rahul: జూలైలో ప్రారంభ‌మ‌య్యే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు టీమ్ ఇండియా ఓపెన‌ర్ కెఎల్ రాహుల్ ఎంపిక‌వ్వ‌డం క‌ష్ట‌మేన‌ని టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ సంజ‌య్ బంగ‌ర్ అన్నాడు. అత‌డి వ్యాఖ్య‌లు క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

కెఎల్ రాహుల్
కెఎల్ రాహుల్

Bangar on Kl Rahul: ఈ ఏడాది జ‌రుగ‌బోయే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమ్ ఇండియా ఓపెన‌ర్ కె.ఎల్ రాహుల్‌కు చోటు ద‌క్క‌డ అనుమాన‌మేన‌ని టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజ‌య్ బంగ‌ర్ అన్నాడు.

గ‌త కొంత‌కాలంగా పేల‌వ ఫామ్ కార‌ణంగా కె.ఎల్ రాహుల్ చాలా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో కె.ఎల్ రాహుల్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. రాహుల్‌పై న‌మ్మ‌కాన్ని ఉంచిన టీమ్ మేనేజ్‌మెంట్ ప‌దే ప‌దే అవ‌కాశాలు ఇస్తోన్న వాటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతోన్నాడు.

మ‌రోవైపు ఇషాన్ కిష‌న్‌, శుభ్‌మ‌న్ గిల్ లాంటి యంగ్ ప్లేయ‌ర్స్ చ‌క్క‌టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. యంగ్ ప్లేయ‌ర్స్ నుంచి నెల‌కొన్న పోటీ నేప‌థ్యంలో రాహుల్‌కు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌చ్చున‌ని సంజ‌య్ బంగ‌ర్ అన్నాడు. ఓపెన‌ర్‌గా రాహుల్‌ స్థానాన్ని బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన ఇషాన్ కిష‌న్ భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు బంగ‌ర్‌పేర్కొన్నాడు.

అత‌డితో పాటు శుభ్‌మ‌న్ గిల్‌, రుతురాజ్ గైక్వాడ్‌ల నుంచి రాహుల్‌కు పోటీ ఎదుర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపాడు. సీనియ‌ర్ ప్లేయ‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ఓపెన‌ర్‌గా వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఎంపికైనా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని సంజ‌య్ బంగ‌ర్ అన్నాడు. జూలై 30 నుంచి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగ‌నుంది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వ‌బోతున్న‌ది.

WhatsApp channel

టాపిక్