Sania Mirza in Australian Open: ప్రత్యర్థి వాకోవర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సానియా, బోపన్న జోడీ-sania mirza and rohan bopnanna in australian open semis after getting walkover in quarterfinals ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Mirza In Australian Open: ప్రత్యర్థి వాకోవర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సానియా, బోపన్న జోడీ

Sania Mirza in Australian Open: ప్రత్యర్థి వాకోవర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సానియా, బోపన్న జోడీ

Hari Prasad S HT Telugu
Jan 24, 2023 01:00 PM IST

Sania Mirza in Australian Open: ప్రత్యర్థి వాకోవర్ తో ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌ చేరింది సానియా, బోపన్న జోడీ. కెరీర్ లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న సానియా మరో టైటిల్ దిశగా ఒక అడుగు ముందుకేసింది.

సానియా మీర్జా, రోహన్ బోపన్న
సానియా మీర్జా, రోహన్ బోపన్న (Twitter)

Sania Mirza in Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభానికి ముందే తన కెరీర్ లో ఇదే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అని చెప్పింది హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అయితే ఈ టోర్నీ విజయంతో తన కెరీర్ కు గొప్ప ముగింపు పలకాలని ఆమె భావిస్తోంది. ఆ దిశగా మరో అడుగు ముందుకు పడింది. మిక్స్‌డ్ డబుల్స్ లో రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగిన ఆమె సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.

క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీకి వాకోవర్ లభించడం విశేషం. లాత్వియా, స్పెయిన్ కు చెందిన జెలెనా ఒస్టాపెంకో, డేవిడ్ వెగా జోడీతో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సి ఉంది. అయితే ఆ జోడీ క్వార్టర్స్ నుంచి తప్పుకోవడంతో సానియా, బోపన్న సెమీస్ చేరారు. అంతకు ముందుకు ఉరుగ్వే, జపాన్ జోడీ ఏరియల్ బెహార్, మకాటో నినోమియాపై 6-4, 7-6 తేడాతో గెలిచి క్వార్టర్స్ చేరింది సానియా, బోపన్న జోడీ.

ఇప్పుడు క్వార్టర్స్ ఆడకుండానే సెమీస్ ఛాన్స్ దక్కడంతో మరో టైటిల్ కు రెండు మ్యాచ్ ల దూరంలో సానియా నిలిచింది. అయితే వుమెన్స్ డబుల్స్ బరిలోనూ దిగిన సానియాకు రెండో రౌండ్లోనే నిరాశ ఎదురైంది. కజకిస్థాన్ కు చెందిన ఏనా డానిలినాతో కలిసి డబుల్స్ బరిలో దిగిన సానియా.. రెండో రౌండ్ లో బెల్జియం, ఉక్రెయిన్ జోడీ అలీసన్ వాన్ ఉయ్‌ట్వాంక్, అనెలినా కలినినా జోడీ చేతిలో ఓడిపోయింది.

సానియా నిజానికి గతేడాది యూఎస్ ఓపెన్ తర్వాతే రిటైర్ అవుతున్నట్లు మొదట అనౌన్స్ చేసింది. అయితే గాయం కారణంగా ఆ టోర్నీలో ఆడలేకపోయింది. ఈ గాయంతో మూడు నెలల పాటు టెన్నిస్ కు దూరమై ఈ మధ్యే తిరిగి రాకెట్ పట్టుకుంది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడి ఆటకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం