Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా-బోపన్న జోడీ ఓటమి.. పరాజయంతో సానియా కెరీర్ ముగింపు-sania mirza and rohan bopanna lose mixed doubles final in australian open 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా-బోపన్న జోడీ ఓటమి.. పరాజయంతో సానియా కెరీర్ ముగింపు

Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా-బోపన్న జోడీ ఓటమి.. పరాజయంతో సానియా కెరీర్ ముగింపు

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 08:40 PM IST

Australian Open 2023: విజయంతో కెరీర్ ముగించాలనకున్న సానీియా మీర్జా కల కలగానే మిగిలింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్ జోడీ చేతిలో సానియా-బోపన్న జోడీ ఓటమి పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జరిగిన ఈ ఫైనల్‌లో వరుస సెట్లోల ఓడిపోయింది.

సానియా-బోపన్న జోడీ
సానియా-బోపన్న జోడీ (AP)

Australian Open 2023: కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా ప్రస్థానం ముగిసింది. ఓటమితో తన కెరీర్‌ను ముగించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో బోపన్నతో కలిసి పోటీ పడిన సానియా మీర్జా తన కెరీర్‌ను పరాజయంతో ముగించింది. బ్రెజిల్ ద్వయం లుయిసా స్టెఫానీ-రఫెల్ మాటోస్‌తో జరిగిన జరిగిన ఫైనల్‌లో సానియా-బోపన్న జోడీ ఓడిపోయింది. ఫలితంగా గ్రాండ్ స్లామ్ విజయంతో రిటైర్మెంట్ పలకాలనుకున్న సానియా కల కలగానే మిగిలిపోయింది.

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్ మ్యాచ్‌లో బ్రెజిల్ జోడీపై 6-7, 2-6 తేడాతో సానియా-బోపన్న పరాజయం చెందారు. ఈ ఓటమితో భారత్ జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే తన చివరి ప్రొఫెషనల్ గ్రాండ్‌స్లామ్ అని సానియా మీర్జా ఇప్పటికే ప్రకటించడంతో అభిమానులు సర్వత్రా ఆసక్తిగా ఎదురచూశారు. అభిమాన క్రీడాకారిణికి ఘనంగా వీడ్కొలు పలకాలని భావించారు. కానీ సెమీస్‌లోనే సానియా ఓడిపోవడంతో ఆ ఆశ తీరలేదు.

ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత ద్వయం అద్భుత ప్రదర్శనను కనబర్చింది. సెమీస్ మ్యాచ్‌లో మూడో సీడ్ యూఎస్ జోడీ డెసిర్లే క్రావ్ జీక్, నీల్ స్కూప్ స్కీని ఓడించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనే గ్రాండ్ స్లామ్ విజయంతో ఆరంభించాలనుకున్న భారత్ ద్వయం.. తొలి రెండు రౌండ్లలో సులభంగా విజయాలను సాధించింది. అనంతరం క్వార్టర్స్‌లో వాకోవర్ రావడంతో మరింత ముందుకు దూసుకొచ్చారు. కానీ అనూహ్యంగా ఫైనల్‌లో బ్రెజిల్ ప్లేయర్ల చేతిలో కంగుతిన్నారు.

సానియా-బోపన్న సొంత తప్పిదాలతో పాటు అనవసర పొరపాట్లు చేయడంతో మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా బోపన్న ఆద్యంత నెట్ వద్ద వరుస తప్పిదాలు చేయడతో భారత్ పతనానికి దారి తీసింది. ఆరు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సానియా గెల్చుకుంది. 2009 ఆస్ట్రేలియాన్ ఓపెన్ సహా మిక్స్‌డ్ డబుల్స్ లో మూడు ఇందులో ఉన్నాయి. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే టోర్నమెంట్ తర్వాత రిటైర్ అవుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్