Rishabh Pant: ఆ విజయాల వెనుక పంత్ క్రెడిట్ ఉంది: రాహుల్ ద్రావిడ్-rahul dravid praises pant captaincy in ind vs sa series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishabh Pant: ఆ విజయాల వెనుక పంత్ క్రెడిట్ ఉంది: రాహుల్ ద్రావిడ్

Rishabh Pant: ఆ విజయాల వెనుక పంత్ క్రెడిట్ ఉంది: రాహుల్ ద్రావిడ్

HT Telugu Desk HT Telugu
Jun 21, 2022 10:29 AM IST

కెప్టెన్ గా పెద్దగా అనుభవం లేకపోయినా సౌతాఫ్రికా తో జరిగిన టీ20 సిరీస్ లో రిషబ్ పంత్ (rishab pant)టీమ్ ఇండియాను చక్కగా ముందుకు నడిపించాడని అన్నాడు టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్(rahul dravid). పంత్ కెప్టెన్సీపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో అతడికి ద్రావిడ్ బాసటగా నిలిచాడు.

<p>రిషబ్ పంత్</p>
రిషబ్ పంత్ (twitter)

సౌతాఫ్రికాతో (ind vs sa) టీ20 సిరీస్ ను 2 2 తో ముగించింది టీమ్ ఇండియా. ఒకానొక దశలో 2 0 తో వెనుకబడిపోయింది. ఇండియాకు వైట్ వాష్ తప్పదంటూ, ఈ సిరీస్ లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఈ పరాజయాల నుంచి బయటపడుతూ వరుసగా రెండు టీ20 మ్యాచ్ లలో విజయాన్ని అందుకున్నది టీమ్ ఇండియా. హార్ధిక్ పాండ్యా(hardik pandya), దినేష్ కార్తిక్ (dinesh karthik) తో పాటు బౌలర్ల సమిష్టి కృషితో సిరీస్ ను సమం చేసి పరువు నిలుపుకుంది. 

ఈ సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించిన పంత్ మాత్రం బ్యాటింగ్ లో పూర్తిగా నిరాశపరిచాడు. అన్ని మ్యాచుల్లో బ్యాటింగ్ దిగిన పంత్ కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఫామ్ పై చాలా విమర్శలొచ్చాయి. పలువురు మాజీ క్రికెటర్లు పంత్ కెప్టెన్సీ పై భిన్నమైన కామెంట్స్ చేశారు. కానీ పంత్ నాయకత్వంపై టీమ్ ఇండియా హెడ్ కోచ్  రాహుల్ ద్రావిడ్ ప్రశంసలు కురిపించారు. సిరీస్ సమం చేయడంలో పంత్ క్రెడిట్ కూడా చాలా ఉందని ద్రావిడ్ అన్నాడు. 

కెప్టెన్సీలో పంత్ కు పెద్దగా అనుభవం లేదని, అయినా చక్కగా జట్టును ముందుకు నడిపించాడని తెలిపాడు.  జాతీయ జట్టు కెప్టెన్ గా వ్యవహరించడం ఈజీ కాదని  ద్రావిడ్ పేర్కొన్నాడు. మంచి కెప్టెన్  అయ్యే లక్షణాలు పంత్ లో చాలా ఉన్నాయని, సారథిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని చెప్పాడు.  కెప్టెన్పీ అంటే కేవలం గెలుపు ఓటములు ఒక్కటే కాదని, టీమ్ ను సమిష్టిగా ముందుకు నడిపించడంలో కెప్టెన్లపై ఎంతో ఒత్తిడి ఉంటుందని అన్నాడు. ఆ భారాన్ని అధిగమిస్తూ పంత్ టీమ్ సమర్థవంతంగా ముందుకు నడిపించాడని అన్నాడు.   

కేవలం ఒక్క సౌతాఫ్రికా సిరీస్ తోనే అతడి నాయకత్వ ప్రతిభపై ఓ అంచనాకు రావడం సరికాదని చెప్పాడు. తొలి రెండు టీ20 మ్యాచ్ లలో టీమ్ ఇండియా కొన్ని పొరపాట్లు చేసిందని ద్రావిడ్ అన్నాడు. ఆ తప్పుల నుండి నేర్చుకున్న అనుభవ పాఠాలతో వరుసగా విజయాల్ని సాధించి సిరీస్ ను సమంగా ముగించడం ఆనందంగా ఉందని చెప్పాడు. 

Whats_app_banner

సంబంధిత కథనం