Australian open | ఎదురులేని రఫేల్​​.. ఆస్ట్రేలియన్​ ఓపెన్​ కైవసం-rafael nadal beats madvedev and wins australian open final 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australian Open | ఎదురులేని రఫేల్​​.. ఆస్ట్రేలియన్​ ఓపెన్​ కైవసం

Australian open | ఎదురులేని రఫేల్​​.. ఆస్ట్రేలియన్​ ఓపెన్​ కైవసం

HT Telugu Desk HT Telugu
Jan 30, 2022 08:34 PM IST

Australian Open finals | స్పెయిన్​ బుల్​ రఫేల్​ నాదల్​కు తిరుగులేదు! ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఫైనల్​లో మెద్వెదేవ్​పై విజయం సాధించి టైటిల్​ను దక్కించుకున్నాడు.

<p>2022 ఆస్ట్రేలియన్​ ఓపెన్​.. రఫేల్​ సొంతం</p>
2022 ఆస్ట్రేలియన్​ ఓపెన్​.. రఫేల్​ సొంతం (ANI)

Rafael Nadal vs Medvedev | ఆస్ట్రేలియన్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ టైటిల్​ను.. స్పెయిన్​ బుల్​ రఫేల్​ నాదల్​ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్​ పోరులో ప్రత్యర్థి డేనియల్​ మెద్వెదేవ్​పై 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో విజయం సాధించాడు. 35ఏళ్ల రఫేల్​కు ఇది రెండో ఆస్ట్రేలియన్​ ఓపెన్​ టైటిల్​. ఈ విజయంతో.. 21 గ్రాండ్​ స్లామ్​లు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు రఫేల్​.

ఐదు గంటల పాటు సాగిన ఫైనల్​లో నాదల్​ చెమటోడ్చాల్సి వచ్చింది. తొలి రెండు సెట్లల్లో మెద్వెదేవ్​.. రఫేల్​పై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించాడు. ఇక మెద్వెదేవ్​ గెలుపు ఖాయమని అందరు భావించారు. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న రఫేల్​.. తను అందరికన్నా మేటి అని మరోమారు నిరూపించుకున్నాడు. వరుస సెట్లు సాధించి మెద్వెదేవ్​కు షాక్​ ఇచ్చాడు. టైటిల్​ను దక్కించుకున్నాడు.

ఇలా రెండు సెట్ల ఓటమి తర్వాత.. విజయం దక్కించుకోవడం రఫేల్​కు 14ఏళ్లల్లో ఇదే తొలిసారి. చివరిగా 2007లో జరిగిన వింబుల్డన్​లో నాటి ప్రత్యర్థి మిఖాయిల్​ యుజ్నీపై ఇలా గెలిచాడు రఫేల్​.

ఫెదరర్- జకోవిచ్​లను వెనక్కి నెట్టి...

టెన్నిస్​ దిగ్గజ క్రీడాకారులు రోజర్​ ఫెదరర్​, నాదల్​, నోవాక్​ జకోవిచ్​లు.. 20 గ్రాండ్​ స్లామ్​లతో సమంగా నిలిచారు. 2022 ఫ్రెంచ్​ ఓపెన్​ గెలిచి 20 గ్రాండ్​ స్లామ్​లు సాధించాడు రఫేల్​. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియన్​ ఓపెన్​ దక్కించుకుని ఫేదరర్​, జకోవిచ్​లను వెనక్కి నెట్టేశాడు.

నాదల్​ గ్రాండ్​ స్లామ్​లు..

ఆస్ట్రేలియన్​ ఓపెన్​:- 4 (2009, 2022)

ఫ్రెంచ్​ ఓపెన్​:- 13 (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020)

వింబుల్డన్​:- 2 (2008, 2010)

యూఎస్​ ఓపెన్​:- 4 (2010, 2013, 2017, 2019)

Whats_app_banner