India vs Bangladesh: ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు బంగ్లాదేశ్ టీమ్ ఇదే
India vs Bangladesh: ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు బంగ్లాదేశ్ టీమ్‌ను ప్రకటించారు. రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం 17 మంది సభ్యుల టీమ్‌ను అక్కడి క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది.
India vs Bangladesh: ఇండియాపై ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో ఇండియా పోరాడినా.. విజయం మాత్రం ఆతిథ్య జట్టునే వరించింది. ఇప్పుడు మూడో వన్డే శనివారం (డిసెంబర్ 10) చట్టోగ్రామ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని బంగ్లా టీమ్ భావిస్తోంది.
అయితే ఆ మ్యాచ్‌కు ముందే తర్వాత జరగబోయే రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ టీమ్‌ను ఎంపిక చేసింది. 17 మంది సభ్యుల ఈ టీమ్‌లోకి సీనియర్ ప్లేయర్స్ ముష్ఫికుర్ రహీమ్, తస్కిన్ అహ్మద్ తిరిగి వచ్చారు. గాయం కారణంగా తస్కిన్ వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్ట్ సమయానికి తస్కిన్ పూర్తి ఫిట్‌గా ఉంటాడో లేడో తెలియకపోయినా అతన్ని ఎంపిక చేశారు.
శనివారం మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబర్ 14 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకూ చట్టోగ్రామ్‌లో తొలి టెస్ట్ జరుగుతుంది. ఇక రెండో టెస్ట్ డిసెంబర్ 22 నుంచి 26 వరకూ మీర్పూర్‌లో జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశానికి తిరిగి వస్తుంది.
తొలి టెస్ట్‌కు బంగ్లాదేశ్ టీమ్ ఇదే
మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హసన్ షాంటో, మోమినుల్ హక్, యాసిర్ అలీ చౌదరీ, ముష్ఫికుర్ రహీమ్, షకీబుల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, నురుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, జాకిర్ హసన్, రెజావుర్ రెహమాన్, అనాముల్ హక్ బిజోయ్