U 19 World Cup : అండర్ 19 వరల్డ్ కప్.. భారత్ తొలి ఓటమి.. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
Under 19 T20 World Cup : మహిళల అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. సూపర్-సిక్స్‌లో ఆస్ట్రేలియాతో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
మహిళల అండర్ 19 వరల్డ్ కప్(U10 World Cup)లో టీమిండియా మెుదటి ఓటమి చూసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా(Australia)తో ఆడిన టీమిండియా(Team India) ఓడిపోయింది. షెఫాలీ వర్మ జట్టు గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచి సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. సూపర్ సిక్స్ గ్రూప్ 1లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. దీంతో సెమీస్ అవకాశాలను కాస్త సంక్లిష్టం చేసుకుంది.
పోచెఫ్‌స్ట్రూమ్‌లో మ్యాచ్ జరిగింది. ముందుగా ఇండియా బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. కెప్టెన్ షెఫాలీ (8), వికెట్ కీపర్ రిచా ఘోష్ (7) పూర్తిగా విఫలమయ్యారు. శ్వేత షెరావత్ (29 బంతుల్లో 21) టాప్ స్కోరర్ గా ఉంది. బసు (14), టిటాస్ సదు (14) రన్స్ సాధించారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. 18.5 ఓవర్లలో 87 పరుగులకే భారత్ ఆలౌటైంది. భారత్(Bharat) నిర్దేశించిన 88 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కేవలం 13.5 ఓవర్లలో పూర్తి చేసింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు.. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇండియాను 87 పరుగులకే కట్టడి చేసింది. స్వల్ప లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. భారత బౌలర్ల(Bowlers)ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. క్లైర్ మూరే (28 బంతుల్లో 25 నాటౌట్), అమీ స్మిత్ (25 బంతుల్లో 26 నాటౌట్) రాణించారు. సియాన జింజర్ మూడు వికెట్లతో భారత్ పతనానికి కారణమైంది. మిల్లీ ఇల్లింగ్ వర్త్, మ్యాగీ క్లర్క్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
టోర్నిలో మెుదటి మూడు మ్యాచుల్లో భారత్ భారీ స్కోర్ చేసింది. అందులో శ్వేతా సెహ్రావత్(Shweta Sehrawat) కీలక పాత్ర పోషించింది. ఈసారి కూడా శ్వేత 21 పరుగులతో భారత్‌లో టాప్ స్కోరర్‌గా ఉంది. ఈ ఓటమి కారణంగా టీమిండియా(Team India) నెట్ రన్ రేట్ (+1.905) బాగా దెబ్బతింది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇండియా తర్వాత మ్యాచ్ జనవరి 22 శ్రీలంకతో ఉంది.
టీమిండియా మహిళల జట్టు
శ్వేత షెరావత్, షఫాలీ వర్మ, త్రిషా, సోనియా, రిచా ఘోష్, చోప్రా, బసు, కశ్యప్, సదు, అర్చన దేవి, సోనమ్ యాదవ్
ఆస్ట్రేలియా టీమ్
కేట్ పెల్లె, జింజర్, క్లైర్ మోర్, ఎల్లా హేవార్డ్, అమి స్మిత్, లూసీ హామిల్టన్, రైస్ మెక్ కెన్నె, ప్యారీస్ హాల్, ఎల్లా విల్సన్, మిల్లి ఇల్లింగ్ వర్త్, మ్యాగీ క్లార్క్.