Umran Malik Fastest Ball Record: ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ బ్రేక్ చేస్తా - పాకిస్థాన్ పేసర్ ఛాలెంజ్
Umran Malik Fastest Ball Record: ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్‌ను తాను బద్దలుకొడతానని ఛాలెంజ్ చేశాడు పాకిస్థాన్ యంగ్ పేసర్ జమాన్‌ఖాన్.
Umran Malik Fastest Ball Record: ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బాల్ డెలివరీ రికార్డ్‌ను తాను బ్రేక్ చేస్తానంటూ పాకిస్థాన్ యంగ్ పేసర్ ఛాలెంజ్ చేశాడు. జనవరిలో శ్రీలంకతో జరిగిన వన్డేలో మ్యాచ్‌లో 156 కిమీ వేగంతో బాల్‌ను సంధించాడు ఉమ్రాన్ మాలిక్.
టీమ్ ఇండియా తరఫున అంత్యత వేగంగా బౌలింగ్ చేసిన బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ముంబాయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 157 కిమీ వేగంతో బౌలింగ్ చేసి చరిత్రను సృష్టించాడు.
ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్న పేసర్స్‌లో ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. ఉమ్రాన్ మాలిక్ రికార్డ్‌ను తాను బద్దలుకొడతానంటూ పాకిస్థాన్ యంగ్ పేసర్ జమాన్‌ఖాన్ ఛాలెంజ్ చేశాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఉమ్రాన్ మాలిక్ కంటే వేగవంతమైన బాల్‌ను సంధిస్తానంటూ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ కలందర్స్‌కు జమాన్ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
లిస్ట్ ఏ క్రికెట్‌లో వరుసగా వికెట్ల సాధిస్తూ పాపులర్‌గా మారాడు. జమ్మూ కశ్మీర్‌కు సమీపంలో ఉన్న పాకిస్థాన్‌లోని ఓ విలేజ్‌లో జన్మించాడు జమాన్‌ఖాన్.