IND vs WI T20: తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్.. వెస్టిండీస్‍తో టీ20లకు టీమిండియా ఎంపిక: రోహిత్, కోహ్లీకి విశ్రాంతి
IND vs WI T20: వెస్టిండీస్‍తో ఐదు టీ20ల సిరీస్‍కు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చింది.
IND vs WI T20: వెస్టిండీస్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‍కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మంది ఆటగాళ్లను విండీస్‍తో టీ20 సిరీస్‍కు సెలెక్ట్ చేసింది. తెలుగు ఆటగాడు నంబూరి తిలక్ వర్మకు తొలిసారి టీమిండియాలో చోటు లభించింది. ఐపీఎల్‍లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించిన ఈ హైదరాబాదీ బ్యాటర్ భారత జట్టులోకి వచ్చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున అదరొగొట్టిన యశస్వి జైశ్వాల్‍కు టీమిండియా టీ20 పిలుపు వచ్చింది. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి టీ20 సిరీస్‍కు విశ్రాంతినిచ్చారు సెలెక్టర్లు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన సెలెక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. పూర్తి వివరాలు ఇవే.
రోహిత్ శర్మ లేకపోవటంతో వెస్టిండీస్‍తో టీ20 సిరీస్‍లో భారత జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‍గా ఎంపికయ్యాడు. కాగా, స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజాకు టీ20 టీమ్‍లో చోటు దక్కలేదు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‍కు అవకాశం వచ్చింది. ఆగస్టు 3న వెస్టిండీస్‍తో ఐదు టీ20 సిరీస్ మొదలుకానుంది. అంతకు ముందు విండీస్‍తో రెండు టెస్టులు, మూడు వన్డేలను భారత జట్టు ఆడనుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‍తో టీ20 సిరీస్ లో టీమిండియాలో ఉన్న జితేశ్ శర్మ, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హూడా, వాష్టింగన్ సుందర్‌కు.. వెస్టిండీస్‍తో టీ20 సిరీస్‍లో ప్లేస్ దక్కలేదు.
వెస్టిండీస్‍లో టీ20 సిరీస్‍కు ఎంపికైన భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‍మన్ గిల్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్‍దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్
వెస్టిండీస్‍లో టీమిండియా మ్యాచ్‍లు జూలై 12న మొదలుకానున్నాయి. జూలై 12న తొలి టెస్టు షురు కానుంది. జూలై 20న రెండు టెస్టు మొదలవుతుంది. ఆ తర్వాత జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు భారత్, వెస్టిండీస్ మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం ఆగస్టు 3వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ మధ్య ఐదు టీ20ల సిరీస్ ఉంటుంది. చివరి రెండు టీ20లు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతాయి. ఇప్పటికే టెస్టు, వన్డేలకు భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు టీ20 సిరీస్‍కు జట్టును ఎంపిక చేసింది.
వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‍కు ఎంపికైన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయ్‍దేవ్ ఉనాద్కత్, నవ్‍దీప్ సైనీ
వన్డే సిరీస్‍కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ , విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, కుల్‍దీప్ యాదవ్, ఉనాద్కత్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్