Golden Boot Award in FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్డెన్‌ బూట్‌ అవార్డు ఎవరికి ఇస్తారో తెలుసా?-golden boot award in fifa world cup importance and winners list ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Golden Boot Award In Fifa World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్డెన్‌ బూట్‌ అవార్డు ఎవరికి ఇస్తారో తెలుసా?

Golden Boot Award in FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్డెన్‌ బూట్‌ అవార్డు ఎవరికి ఇస్తారో తెలుసా?

Hari Prasad S HT Telugu
Nov 14, 2022 10:25 PM IST

Golden Boot Award in FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్డెన్‌ బూట్‌ అవార్డును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ ఏడాది ఖతార్‌ టోర్నీ ప్రారంభానికి సమయం దగ్గర పడిన నేపథ్యంలో అసలు ఈ గోల్డెన్‌ బూట్‌ అవార్డు ఏంటో ఒకసారి చూద్దాం.

2018లో తాను గెలుచుకున్న గోల్డెన్ బూట్ అవార్డుతో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ కేన్
2018లో తాను గెలుచుకున్న గోల్డెన్ బూట్ అవార్డుతో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ కేన్ (AFP)

Golden Boot Award in FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఈ నెల 20న ప్రారంభం కాబోతోంది. ఈసారి టోర్నీకి ఖతార్‌ వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో 32 టీమ్స్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్‌ బూట్‌ అవార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏంటీ గోల్డెన్‌ బూట్‌ అవార్డు?

గోల్డెన్‌ బూట్‌ అవార్డును వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌కు ఇస్తారు. దీనిని అధికారికంగా 1982 వరల్డ్‌కప్‌లో ఇవ్వడం ప్రారంభించారు. 2006 వరల్డ్‌కప్‌ వరకూ దీనిని గోల్డెన్‌ షూ అవార్డుగా పిలిచేవారు. 2010 నుంచి దీనిని గోల్డెన్‌ బూట్‌ అవార్డుగా పేరు మార్చారు. ఇప్పటి వరకూ ఫిఫా వరల్డ్‌కప్‌లలో టాప్‌ గోల్‌ స్కోరర్స్‌కు గోల్డెన్‌ బూట్‌, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వాళ్లకు సిల్వర్, బ్రాంజ్‌ బూట్‌లను అందించారు.

1982 నుంచి అధికారికంగా ఈ అవార్డు ఇస్తున్నా.. అంతకుముందు తొలి టోర్నీ జరిగిన 1930 నుంచి కూడా అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్స్‌కు ప్రత్యేకమైన అవార్డు ఇస్తున్నారు. తొలి టోర్నీ అర్జెంటీనాకు చెందిన గిల్లెర్మో స్టాబిలే ఈ అవార్డు అందుకున్నాడు. ఆ టోర్నీలో అతడు 8 గోల్స్‌ చేశాడు. ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక గోల్స్‌ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన జస్ట్‌ ఫాంటెయిన్‌ పేరిట ఉంది. అతడు 1958 వరల్డ్‌కప్‌లో 13 గోల్స్‌ చేశాడు.

ఇప్పటి వరకూ చరిత్రలో ఏ ప్లేయర్‌ కూడా ఒకటి కంటే ఎక్కువసార్లు గోల్డెన్‌ బూట్‌ అవార్డు గెలుచుకోలేదు. అయితే అత్యధికంగా బ్రెజిల్‌ ప్లేయర్స్‌ ఆరుసార్లు ఈ అవార్డు అందుకోవడం విశేషం. ఈ అవార్డు కింద బంగారం తయారు చేసిన ఓ బూటును ప్లేయర్స్‌కు ఇస్తారు.

చివరిసారి 2018లో ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ కేన్‌ గోల్డెన్‌ బూట్‌ అవార్డు గెలుచుకున్నాడు. రష్యాలో జరిగిన ఆ వరల్డ్‌కప్‌లో హ్యారీ కేన్‌ 6 గోల్స్‌తో టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు 2014లో కొలంబియాకు చెందిన జేమ్స్‌ రోడ్రిగ్స్‌ (6 గోల్స్‌), 2010లో జర్మనీకి చెందిన థామస్‌ ముల్లర్‌ (5 గోల్స్‌) గోల్డెన్‌ బూట్ అవార్డులను గెలుచుకున్నారు.

WhatsApp channel