Ganguly Comments on Bumrah Injury: బుమ్రాను వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి త‌ప్పించ‌లేదు - గంగూలీ కామెంట్స్ --ganguly reacts on bumrah injury he says that bumrah is still not ruled out yet of the t20 world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ganguly Comments On Bumrah Injury: బుమ్రాను వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి త‌ప్పించ‌లేదు - గంగూలీ కామెంట్స్ -

Ganguly Comments on Bumrah Injury: బుమ్రాను వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి త‌ప్పించ‌లేదు - గంగూలీ కామెంట్స్ -

Nelki Naresh Kumar HT Telugu
Oct 01, 2022 09:44 AM IST

Ganguly Comments on Bumrah Injury: వెన్నుముక గాయంతో బుమ్రా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి దూర‌మ‌య్యాడంటూ వ‌స్తోన్న వార్త‌ల‌ను బీసీసీఐ ప్రెసిడెంట్ సౌర‌భ్ గంగూలీ ఖండించారు. బుమ్రాను టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ నుంచి ప‌క్క‌న‌పెట్ట‌లేద‌ని పేర్కొన్నాడు.

బుమ్రా
బుమ్రా (Twitter)

Ganguly Comments on Bumrah Injury: వెన్నుముక ఫ్రాక్చ‌ర్స్ తో ఇండియ‌న్ స్పీడ్‌స్టార్ బుమ్రా(Bumrah) వ‌ర‌ల్డ్ క‌ప్ కు దూర‌మైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. గాయం తీవ్ర‌త‌ను బ‌ట్టి అత‌డు దాదాపు ఐదారు నెల‌ల వ‌ర‌కు క్రికెట్ ఆడ‌క‌పోవ‌చ్చున‌ని క్రికెట్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు బుమ్రా జ‌ట్టుకు దూర‌మ‌వ్వ‌డం టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ అంటూ ప‌లువురు క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అత‌డి స్థానంలో ష‌మీ, సిరాజ్‌ల‌లో ఒక‌రిని ఎంపిక‌చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొంటున్నారు.

కాగా బుమ్రా గాయంపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌర‌బ్ గంగూలీ(Sourav Ganguly) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. బుమ్రా వ‌ర‌ల్డ్ క‌ప్‌కు దూర‌మ‌య్యాడ‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని గంగూలీ అన్నాడు. మ‌రో మూడు నాలుగు రోజుల్లో బుమ్రా గాయంపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి అత‌డిని ప‌క్క‌న‌పెట్ట‌లేద‌ని పేర్కొన్నాడు.

ప్ర‌స్తుతం బూమ్రా బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో ఉన్న‌ట్లు తెలిసింది. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గాయంపై చికిత్స‌ను పొందుతున్న‌ట్లు చెబుతున్నారు. వారి నుంచి వ‌చ్చే నివేదిక ఆధారంగానే బుమ్రా విష‌యంలో బీసీసీఐ ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లు తెలిసింది. గంగూలీ కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

కాగా ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో బుమ్రా ఆడాడు. సౌతాఫ్రికా సిరీస్‌కు సెలెక్ట‌ర్లు అత‌డిని ఎంపిక‌చేశారు. కానీ గాయంతో అత‌డు దూర‌మ‌య్యాడు.

WhatsApp channel