CWG 2022 Day 2 Live Updates: భారత్‌కు తొలి స్వర్ణం.. మీరాబాయి చాను అదిరే విజయం
కామన్వెల్త్ గేమ్స్ లో తొలిరోజు ఇండియాకు చక్కటి ఆరంభం దక్కింది. క్రికెట్ మినహా మిగిలిన అన్ని గేమ్స్ లో విజయాల్ని అందుకున్నది. హాకీ ఉమెన్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ ప్లేయర్స్ చక్కటి విజయాలతో పతకాల వేటను మొదలుపెట్టారు. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. రెండో రోజు వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను, బాక్సింగ్ లో లవ్లీనా బోర్గోహైన్ బ్మాడ్మింటన్ లో పీవీ సింధుతో పాటు పలువురు స్టార్స్ ప్లేయర్స్ మ్యాచ్ లు ఉండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Sat, 30 Jul 202205:06 PM IST
మీరాబాయి చాను ముచ్చటగా మూడో సారి స్వర్ణం
వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో పసిడి పట్టేసింది. వరసుగా 109, 113 కేజీల లిఫ్ట్ చేసిన మీరాబాయి చాను స్వర్ణాన్ని అందుకుంది.
Sat, 30 Jul 202204:03 PM IST
లాన్ బౌల్స్‌లో కుక్ ఐలాండ్స్‌పై భారత్ విజయం
లాన్ బౌల్స్‌లో భారత్ అదరగొట్టింది. కుక్ ఐలాండ్స్‌పై 13-10 తేడాతో విజయం సాధించింది. ఆరంభంలో ఆధిపత్యం చెలాయించిన భారత్ 8-0తో ముందు వరుసలో ఉంది. అనంతరం 5-12 తేడాతో కుక్ ఐలాండ్స్ పుంజుకుంది. ఆ ఆధక్యాన్ని 10-12 వరకు తీసుకెళ్లింది. అయితే చివరకు భారత్‌నే గెలుపు వరించింది.
Sat, 30 Jul 202203:43 PM IST
దూసుకెళ్తోన్న మీరాబాయి చాను
భారత వెయిట్ లిఫ్టర్ క్రీడాకారిణి మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొడుతుంది. తన తొలి ప్రయత్నంలోనే 84 కేజీల బరువును ఎత్తిన భారత అథ్లెట్ రెండో ప్రయత్నంలో 88 కేజీలతో తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డను నెలకొల్పింది. అయితే మూడో ప్రయత్నంలో 90 కేజీల వెయిట్ లిఫ్ట్ చేయడంలో విఫలమైంది. అయినప్పటికీ ఇప్పటికే పతక రేసులో అగ్రస్థానంలో ఉంది. తన తర్వాత రెండో స్థానంలో ఉన్న మారి హంతిరా రొలియా రానైవోసావాతో మధ్య అంతరం 12 కేజీలు ఉంది.
Sat, 30 Jul 202202:47 PM IST
లాన్ బాల్స్‌లో లీడ్‌లో ఉన్న భారత్
కామన్వెల్త్ గేమ్స్‌లో క్రుక్స్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆధిక్యం సంపాదించింది. పురుషుల పారిస్ ఈెవెంట్‌లో 7-0 తేడాతో లీడ్‌లో ఉంది.
Sat, 30 Jul 202212:52 PM IST
భారత్ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారికి కాంస్యం
భారత వెయిట్ లిఫ్టర్ గురురాజ పూజారి కాంస్య పతకం గెలిచాడు. పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజ తన మూడో ప్రయత్నంలో 151 కేజీలను ఎత్తి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. మొత్తంగా 269 కేజీలను ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. మలేసియన్ వెయిట్ లిఫ్టర్ మహ్మద్ అజ్నీల్ 153 కేజీలతో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. అతడు మొత్తం 285 కేజీలను ఎత్తాడు. రెండో స్థానంలో మొరియా బరు 273 కేజీలతో రెండో స్థానంతో రజతం దక్కించుకున్నాడు.
Sat, 30 Jul 202212:21 PM IST
భారత మహిళా హాకీ ప్లేయర్‌కు కరోనా.. స్వదేశానికి రాక
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా హాకీ ప్లేయర్ నవజోత్ కౌర్ ప్రయాణం కఠినమైన రీతిలో ముగిసింది. కరోనా పాజిటివ్ రావడంతో ఆమె కామన్వెల్త్ గేమ్స్‌కు దూరం కానుంది. ఫలితంగా స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది.
Sat, 30 Jul 202211:24 AM IST
శ్రీలంకపై భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ క్లీన్ స్వీప్
భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ శ్రీలంకతో జరిగిన గ్రూప్ పోరులో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికే శ్రీలంకతో జరిగిన 4 మ్యాచ్‌ల్లో అన్నింటిలో విజయం సాధించిన భారత షట్లర్లు.. తాజాగా ఐదో విజయాన్ని కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశారు. ట్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్ జోడీ లంక ద్వయంపై విజయం సాధించడంతో 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేశారు.
Sat, 30 Jul 202210:21 AM IST
కామన్వెల్త్‌లో భారత్ బోణీ.. రజతం సాధించిన సాంకేత్
కామన్వెల్త్ గేమ్స్‌లో ఎట్టకేలకు భారత్ పతకాల బోణీ కొట్టింది. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత అథ్టెల్ సాంకేత్ సర్గార్ రజతం సాధించాడు. 55 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్స్‌తో అతడు సిల్వర్ గెలిచాడు. ఫైనల్‌లో 139 కేజీల క్లీన్ అండ్ జెర్క్ దశలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. మలేసియన్ అథ్లెట్ మహ్మద్ అనీక్ 142 కేజీలతో స్వర్ణ నెగ్గాడు.
Sat, 30 Jul 202210:15 AM IST
బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఆకర్షి కశ్యప్ విజయం
బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సత్తా చాటుతున్నారు. భారత షట్లర్ ఆకార్షి కశ్యప్,, శ్రీలంకకు చెందిన సుహాసిని విడేంజ్‌పై అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నాడు. 21-3, 21-9 తేడాతో గెలిచాడు. ఫలితంగా భారత్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
Sat, 30 Jul 202209:31 AM IST
వెయింట్ లిఫ్టింగ్‌లో గోల్డ్ రేసులో భారత అథ్లెట్ సాంకేత్ సర్గార్
వెయింట్ లిఫ్టింగ్‌లో భారత అథ్లెట్ సాంకేత్ మహదేవ్ సర్గార్ తన జాతీయ రికార్డు 113 కేజీలతో ముందు వరుసలో నిలిచాడు. 113 కేజీల క్లీన్ జెర్క్‌తో సాంకేత్ తొలి స్థానలో నిలిచి గోల్డ్ రేసులో ఉన్నాడు. శ్రీలంక ఇసురు కుమార యోడాజే 112 కేజీలతో ఫౌల్‌గా నిలవడంతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మలేసియన్ అథ్లెట్ రెండో స్థానంలో ఉన్నాడు. మరో ప్రయత్నంలో వీరిలో ఎవరైతై క్రీన్ అండ్ జెర్క్ ఫేజ్‌లో ఉత్తమంగా ప్రదర్శిస్తారో వారు విజేతగా నిలుస్తారు.
Sat, 30 Jul 202209:31 AM IST
బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ లో అశ్విన్-సిరాజ్ విజయం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో రెండో రోజు బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత షట్లర్లు సాత్విక్ సిరాజ్-అశ్విని పొన్నప్ప ముందంజ వేశారు. శ్రీలంక ద్వయం సచిన్ దియాస్-థిలిని హెందాహేవాపై 21-14, 21-9 తేడాతో తొలి మ్యాచ్‍లో విజయం సాధించారు.
Sat, 30 Jul 202208:04 AM IST
వెయిట్ లిఫ్టర్లలో మెడల్ సాధించేది ఎవరు
కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజు వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్స్ కు జరుగున్నాయి. వీటిలో మీరాబాయి చానుపై అందరి కళ్లు ఉన్నాయి. మీరాబాయి చానుతో పాటు సంకేత్ సర్గార్, గురు రాజా, బింద్యారాణి దేవి వెయిట్ లిఫ్టింగ్ లో పోటీపడబోతున్నారు. ఈ నలుగురిలో ఒక్క మెడల్ ఖాయంగానే కనిపిస్తోంది.
Sat, 30 Jul 202205:34 AM IST
CWG 2022 Day 2 Live Updates: కామన్వెల్త్ గేమ్స్ లో రెండో రోజు ఇండియా షెడ్యూల్ వివరాలు
లాన్ బాల్స్ ట్రిపుల్ ఛేజ్ మధ్యాహ్నం 1 నుండి ప్రారంభం ఉమెన్స్ సింగిల్స్- తానియా చౌదరి
అథ్లెటిక్స్ మధ్యాహ్నం 1.30 కు ప్రారంభం
మెన్స్ మారథాన్ ఫైనల్ - నితేంద్ర సింగ్ రావత్
బ్యాడ్మింటన్ 1.30 నుంచి ప్రారంభం
మిక్స్ డ్ టీమ్ గ్రూప్ ఏ ఇండియా వర్సెస్ శ్రీలంక
వెయిట్ లిఫ్టింగ్ మధ్నాహ్నం 1.30 నుంచి ప్రారంభం
55 కేజీల విభాగం - సంకేత్ మహదేవ్ సార్గర్ , 61 వ కేజీల విభాగం - గురురాజ్
టేబుల్ టెన్నిస్ మధ్నాహ్నం 2 గంటలకు ప్రారంభం
ఇండియా ఉమెన్స్ టీమ్ వర్సెస్ గయానా
ఇండియా మెన్స్ టీమ్ వర్సెస్ నార్త్ ఐర్లాండ్ మ్యాచ్
సైక్లింగ్ మధ్నాహ్నం 2.30 నుంచి
ఉమెన్స్ స్ప్రింట్ క్వాలీఫయింగ్
మయూరి లూటే, త్రియాశీ పాల్
3000 మీటర్స్ - మీనాక్షి
4000 మీటర్స్ మెన్స్ విశ్వజీత్ సింగ్, దినేష్ కుమార్
స్విమ్మింగ్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభం
200 మీటర్స్ ఫ్రీ స్టైల్ - ఖుషాగ్రా రావత్
బాక్సింగ్ సాయంత్రం 4.30 నుంచి ప్రారంభం
54 57 కేజీల కేటగిరి - హుసాముద్దీన్ మహమ్మద్
స్క్వాష్ సాయంత్రం 4.30 నుంచి ప్రారంభం
మెన్స్ సింగిల్స్ - రమిత్ టాండన్, సౌరభ్ ఘోషల్
ఉమెన్స్ సింగిల్స్ - జాషువా చిన్నప్ప, సునయ్న సారా కురువిల్లా
వెయిట్ లిఫ్టింగ్ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం
49 కేజీ విభాగం - మీరాబాయి ఛాను
సైక్లింగ్ రాత్రి 8.30 నుంచి
ఈశ్వన్ అల్బెన్
టేబుల్ టెన్నిస్ రాత్రి 8.30 నుంచి
ఇండియా వర్సెస్ నార్త్ ఐస్ లాండ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
జిమ్నాస్టిక్స్ రాత్రి 9 గంటలకు ప్రారంభం
ప్రణతీ నాయక్, రుతుజా నటరాజ్, సమంత
బాక్సింగ్ రాత్రి 11 గంటల నుంచి
లవ్లీనా బోర్గెహెయిన్
బ్యాడ్మింటన్ రాత్రి 11.30 నుంచి
మిక్స్ డ్ టీమ్ ఇండియా వర్సెస్ అస్ట్రేలియా
హాకీ రాత్రి 11.30 కు ప్రారంభం
ఉమెన్స్ హాకీ ఇండియా వర్సెస్ వేల్స్
బాక్సింగ్ ఆదివారం తెల్లవారుజామున
92 కేజీ కేటగిరి సంజీత్