Babar Azam: బాబర్ ఆజం కొత్త రికార్డు.. న్యూజిలాండ్‌ను మూడు వన్డేల్లోనూ చిత్తు చేసిన పాక్-babar azam creates new record as pakistan beats new zealand in third odi too ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Babar Azam Creates New Record As Pakistan Beats New Zealand In Third Odi Too

Babar Azam: బాబర్ ఆజం కొత్త రికార్డు.. న్యూజిలాండ్‌ను మూడు వన్డేల్లోనూ చిత్తు చేసిన పాక్

బాబర్ ఆజం కెప్టెన్సీలో మరో విజయం సాధించిన పాకిస్థాన్
బాబర్ ఆజం కెప్టెన్సీలో మరో విజయం సాధించిన పాకిస్థాన్ (AP)

Babar Azam: బాబర్ ఆజం కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్‌ను మూడు వన్డేల్లోనూ చిత్తు చేసిన పాకిస్థాన్.. ఐదు వన్డేల సిరీస్ ను సొంతం చేసుకుంది. కెప్టెన్ గా బాబర్ ఈ రికార్డు అందుకున్నాడు.

Babar Azam: బాబర్ ఆజం మరో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఈసారి బ్యాటింగ్ లో కాదు. పాకిస్థాన్ కెప్టెన్ గా ఆ రికార్డు అందుకోవడం విశేషం. వరుసగా మూడో వన్డేలోనూ న్యూజిలాండ్ ను పాక్ చిత్తు చేసింది. దీంతో వన్డే క్రికెట్ లో పాకిస్థాన్ తరఫున అత్యుత్తమ విజయాల శాతం నమోదు చేసిన కెప్టెన్ గా బాబర్ ఆజం నిలిచాడు. ఈ క్రమంలో అతడు సలీం మాలిక్ రికార్డును బ్రేక్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

బాబర్ కెప్టెన్సీలో గత 15 వన్డేల్లో పాకిస్థాన్ 13 గెలిచింది. మొత్తంగా అతడు 24 వన్డేల్లో కెప్టెన్ గా ఉండగా.. అందులో పాక్ 16 విజయాలు సాధించింది. దీంతో అతని విజయా శాతం 68.75కు చేరుకుంది. గతంలో సలీం మాలిక్ 64.7 శాతం విజయాలతో టాప్ లో ఉండేవాడు. అతడు పాకిస్థాన్ కు 34 వన్డేల్లో కెప్టెన్ గా ఉండగా.. అందులో 21 విజయాలు సాధించింది.

ఇప్పుడతని రికార్డును బాబర్ ఆజం బ్రేక్ చేశాడు. ఈ ఇద్దరి తర్వాత వకార్ యూనిస్ 61.66 శాతం విజయాలు సాధించాడు. అతని కెప్టెన్సీలో పాక్ 62 వన్డేల్లో 37 గెలిచింది. ఇక మరో మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కెప్టెన్సీలో పాక్ 109 వన్డేల్లో 66 విజయాలు (61.46 శాతం), షోయబ్ మాలిక్ కెప్టెన్సీలో 41 వన్డేల్లో 25 విజయాలు (60.97 శాతం) సాధించింది.

న్యూజిలాండ్ తో జరిగిన తాజా వన్డేలో పాకిస్థాన్ 26 పరుగులతో గెలిచింది. ఓపెనర్ ఇమాముల్ హక్ 90, బాబర్ ఆజం 54 పరుగులు చేశారు. దీంతో పాక్ 6 వికెట్లకు 287 రన్స్ చేయగా.. తర్వాత న్యూజిలాండ్ 261 పరుగులకే ఆలౌటైంది. దీంతో 2011 తర్వాత తొలిసారి పాకిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓ వన్డే సిరీస్ ఓడిపోయినట్లయింది.

సంబంధిత కథనం