Shane Warne: షేన్‌ వార్న్‌ బాల్‌ ఆఫ్‌ ద సెంచరీ వేసింది ఈ రోజే.. ఇదీ ఆ వీడియో-29 years ago on this day shane warne bowled ball of the century ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shane Warne: షేన్‌ వార్న్‌ బాల్‌ ఆఫ్‌ ద సెంచరీ వేసింది ఈ రోజే.. ఇదీ ఆ వీడియో

Shane Warne: షేన్‌ వార్న్‌ బాల్‌ ఆఫ్‌ ద సెంచరీ వేసింది ఈ రోజే.. ఇదీ ఆ వీడియో

Hari Prasad S HT Telugu
Jun 04, 2022 12:42 PM IST

స్పిన్‌ లెజెండ్ షేన్‌ వార్న్‌ అకాల మరణం చెంది రెండు నెలలకుపైనే అయినా.. క్రికెట్‌ ప్రపంచం అతన్ని గుర్తు చేసుకుంటూనే ఉంది. తాజాగా అతడు బాల్‌ ఆఫ్‌ ద సెంచరీ వేసిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది.

ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు షేన్ వార్న్ కు నివాళి
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు షేన్ వార్న్ కు నివాళి (AFP)

లండన్‌: క్రికెట్ హిస్టరీలో ఆల్‌టైమ్‌ గ్రేట్ బౌలర్లలో షేన్‌ వార్న్‌ ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా గడ్డపై పుట్టి తన స్పిన్‌ మాయతో మేటి బ్యాటర్లను కూడా దిమ్మదిరిగేలా చేశాడు. ఎక్కడో లెగ్‌ స్టంప్‌ బయట పడిన బాల్‌ ఎక్కడికో వెళ్లిపోతుందిలే అనుకొని వదిలేసిన బ్యాటర్‌ వెనక్కి తిరిగి చూసుకుంటే బెయిల్స్‌ కింద పడిపోయి ఉంటాయి. ఇలా లెగ్ స్పిన్‌ ఆర్ట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లిన ఘనత కచ్చితంగా వార్న్‌కు దక్కుతుంది.

అలాంటి బౌలర్‌ ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్ క్రికెట్‌లో తాను వేసిన తొలి బంతికే సంచలనం సృష్టించాడు. ఇప్పటికీ ఆ బాల్‌ను బాల్ ఆఫ్‌ ద సెంచరీగా కీర్తిస్తున్నారంటే అది ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా 29 ఏళ్ల కిందట.. అంటే 1993, జూన్‌ 4న షేన్‌ వార్న్‌ క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే బాల్ వేశాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ మైక్‌ గ్యాటింగ్‌కు ఆ బాల్‌ చూసి దిమ్మదిరిగిపోయింది. అటు అంపైర్‌ కూడా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు.

లెంగ్‌ స్టంప్‌ బయట పడిన ఆ బాల్‌ను గ్యాటింగ్‌ వదిలేయగా.. అది కాస్తా ఆఫ్‌స్టంప్‌ను తాకింది. బాల్‌ అంతటి టర్న్‌ ఎలా తీసుకుందో అర్థం కాక గ్యాటింగ్‌ షాక్‌ తిన్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో వార్న్‌ వేసిన తొలి బాల్‌ అది. రెండేళ్ల కిందట ఐసీసీ ఈ బాల్‌ ఆఫ్‌ ద సెంచరీ గురించి వార్న్ మాట్లాడిన వీడియోను అభిమానులతో షేర్‌ చేసుకుంది. అయితే ఈ బాల్‌ అనుకోకుండా వేసిందే అని, మళ్లీ తానెప్పుడూ అలాంటి బాల్‌ వేయలేదని వార్న్‌ ఆ వీడియోలో చెప్పాడు. ఆ బాల్‌ తన జీవితాన్నే మార్చేసిందని అతనన్నాడు.

ఈ ఏడాది మార్చిలో వార్న్‌ 52 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. థాయ్‌లాండ్‌లో వెకేషన్‌పై ఉన్న వార్న్‌ గుండెపోటుతో చనిపోయాడు. టెస్టుల్లో 708 వికెట్లు తీసుకున్న ఘనత వార్న్‌ది. మురళీధరన్‌ (800) తర్వాత అత్యధిక వికెట్ల రికార్డు షేన్‌ వార్న్‌ పేరిటే ఉంది.

WhatsApp channel

టాపిక్