Navaratri: 2024 లో నవరాత్రులు ఎప్పుడు నిర్వహించుకోవాలి?
Navaratrulu: 2024లో నవరాత్రులు రెండు సార్లు జరుపుకుంటారు. ఏయే తేదీల్లో నవరాత్రులు వచ్చాయంటే..
Navaratrulu: సనాతన ధర్మంలో దుర్గామాతకి అంకితం చేయబడిన నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులని సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుంటారు. సంవత్సరంలో వచ్చే మొదటి నవరాత్రులని చైత్ర నవరాత్రులు అంటారు.
రెండో సారి వచ్చే నవరాత్రులని శార్దియ నవరాత్రులు అంటారు. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. 2024 లో నవరాత్రులు ఎప్పుడు వస్తాయి, ఏ రోజున అమ్మవారిని పూజించాలో తెలుసుకుందాం.
చైత్ర నవరాత్రులు
ఏడాదిలో తొలిసారిగా వచ్చే నవరాత్రులు చైత్ర నవరాత్రులు. తొమ్మిది రోజుల పాటు దుర్గామాతని పూజిస్తారు.
ఏప్రిల్ 9, మెదటి తిథి- శైలపుత్రి దేవి ఆరాధన
ఏప్రిల్ 10, రెండవ తిథి- బ్రహ్మచారిణి దేవి ఆరాధన
ఏప్రిల్ 11, తృతీయ తిథి- చంద్రఘంటా దేవి ఆరాధన
ఏప్రిల్ 12, చతుర్థి తిథి- కూష్మాండ దేవి ఆరాధన
ఏప్రిల్ 13, పంచమి తిథి- స్కందమాత ఆరాధన
ఏప్రిల్ 14, షష్ఠి తిథి- కాత్యాయని దేవి ఆరాధన
ఏప్రిల్ 15, సప్తమి తిథి- మా కాళరాత్రి దేవి ఆరాధన
ఏప్రిల్ 16, అష్టమి తిథి- మాత మహాగౌరీ ఆరాధన
ఏప్రిల్ 17, నవమి తిథి- మాత సిద్ధిధాత్రీ దేవి ఆరాధన
చైత్ర ఘటస్థాపన శుభ సమయం
ఘట స్థాపన ముహూర్తం- ఏప్రిల్ 9, మంగళవారం ఉదయం 6.02 గంటల నుంచి 10.16 వరకు
వ్యవధి- 4 గంటల 14 నిమిషాలు
ఘటస్థాపన అభిజిత్ ముహూర్తం- 11.57 నుంచి మధ్యాహ్నం 12.48 వరకు
వ్యవధి- 51 నిమిషాలు
శార్దీయ నవరాత్రులు ఎప్పుడు?
అక్టోబర్ 3, మొదటి తిథి- తల్లి శైలపుత్రి ఆరాధన
అక్టోబర్ 4, రెండో తిథి- బ్రహ్మచారిణి దేవి ఆరాధన
అక్టోబర్ 5, తృతీయ తిథి- చంద్రఘంటా దేవి ఆరాధన
అక్టోబర్ 6, చతుర్థి తిథి- కూష్మాండ దేవి ఆరాధన
అక్టోబర్ 7, పంచమి తిథి- స్కందమాత ఆరాధన
అక్టోబర్ 8, షష్ఠి తిథి- కాత్యాయని దేవి ఆరాధన
అక్టోబర్ 9, సప్తమి తిథి- మా కాళరాత్రి దేవి ఆరాధన
అక్టోబర్ 10, అష్టమి తిథి- మాత మహాగౌరీ ఆరాధన
అక్టోబర్ 11, నవాటి తిథి- మాత సిద్ధిధాత్రీ దేవి ఆరాధన
ఘట స్థాపన శుభ సమయం
ఘటస్థాపన ముహూర్తం- అక్టోబర్ 3, 2024 గురువారం ఉదయం 6.15 నుంచి 7.22 వరకు
వ్యవధి- 1 గంట 6 నిమిషాలు
ఘట స్థాపన అభిజిత్ ముహూర్తం- 11.46 నుంచి 12.33 వరకు
వ్యవధి- 47 నిమిషాలు