Palmistry: మీ అరచేతిలో 'A' అనే అక్షరం కనిపిస్తుందా.. అయితే మీరు ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే-what does it mean when you have letter a on your palm effects fo letters on palm ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Palmistry: మీ అరచేతిలో 'A' అనే అక్షరం కనిపిస్తుందా.. అయితే మీరు ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

Palmistry: మీ అరచేతిలో 'A' అనే అక్షరం కనిపిస్తుందా.. అయితే మీరు ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

Ramya Sri Marka HT Telugu
Nov 13, 2024 04:06 PM IST

Hasta saamudrikam: అరచేతిపై కొన్ని గుర్తులు ఉండటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని రకాల గుర్తులు కొన్నింటిని సూచిస్తాయి. దీని ప్రకారం అరచేతిలో ‘A’ అనే అక్షరపు గుర్తు ఉండటం దేన్ని సూచిస్తుందో, దానికి అర్థం ఏంటో తెలుసుకుందాం.

అరచేతిలో 'A' అక్షరం దేన్ని సూచిస్తుంది
అరచేతిలో 'A' అక్షరం దేన్ని సూచిస్తుంది

అరచేతిలో ఉండే రేఖలు, గుర్తులు మొదలైన వాటి సహాయంతో ఒక వ్యక్తి గతం, భవిష్యత్తుతో పాటు వర్తమానాన్ని కూడా అంచనా వేయచ్చని హస్త సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అరచేతి గీతలను బట్టి వ్యక్తి ఆర్థిక స్థితి, వైవాహిక జీవితం, ఆరోగ్యం, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని లెక్కించవచ్చని హస్త సాముద్రిక నిపుణులు నమ్ముతారు. చాలాసార్లు చేతి రేఖల్లో ఇంగ్లిష్ అక్షరాల ఆకారాలు మనకు కనిపిస్తుంటారు. ఈ అక్షరాలు A నుండి Z వరకు ఉంటాయి. కొన్ని రకాల గుర్తులు అదృష్టాన్ని సూచిస్తే.. మరికొన్ని అనారోగ్యాన్ని, దారిద్య్రాన్ని సూచిస్తాయి. అలా అరచేతిలో ‘A’ అనే అక్షరం ఉండటం దేనికి సంకేతం. హస్తసాముద్రికం ప్రకారం ఈ గుర్తుకు అర్థం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం..

  • అరచేతిపై ‘A’ గుర్తును హస్తసాముద్రికం శాస్త్రం నిపుణులు చాలా పవిత్రంగా భావిస్తారు. సాధారణంగా ఈ గుర్తు అందరి చేతిలో కనిపించదు. అరచేతిలో ‘A’ ఆకారం ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెబుతారు. వీరు ధనవంతులుగా ఉంటారని భావిస్తారు. వీరు పట్టిందల్లా పసిడిగా మారుతుందని నమ్ముతారు. జాతక రీత్యా చూస్తే వీరు మంచి వ్యాపారులు అవుతారు.
  • హస్తసాముద్రికం ప్రకారం.. అరచేతిలో ఎ గుర్తు ఉన్నవారు తమ కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తినీ, కుటుంబ సంబంధాలను బ్యాలెన్స్ చేస్తూ ఇంటా బయటా సానుకూల వాతావరణాన్ని ఏర్పరుచుకుంటారు. అలాగే తమ సమస్యలకు తమదైన పరిష్కారాలను కనుగొంటారు.
  • ఈ గుర్తు ఉన్న వ్యక్తులు స్నేహ పూర్వక స్వభావం కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎల్లప్పుడూ ముందుంటారు. తమ చుట్టూ ఉండే మనుషులను మంచి తనంతో, స్నేహభావంతో ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటారు.
  • అరచేతిలో A ఉన్నవారు వృత్తిపరంగా కూడా మంచి పేరు దక్కించుకుంటారు. పూర్తి అంకిత భావంతో పనులు చేస్తారు. కష్టానికి తగిన ఫలితం వీరికి తప్పకుండా దక్కుతుందని హస్త సాముద్రిక శాస్త్రం చెబుతోంది.
  • ఈ గుర్తు ఉన్నవారు తెలివైన వారు, ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారని హస్త సాముద్రిక శాస్త్ర నిపుణులు భావిస్తారు. తన భవిష్యత్తు చక్కగా మలుచుకోవడంపై దృష్టి పెడతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని సొంతంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
  • అరచేతిలో ‘A’ గుర్తు ఉన్నవారికి మరో మంచి ఫలితం ఏంటంటే.. ఈ వ్యక్తులకు డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు కూడా వీరు చాలా తెలివిగా ప్రవర్తించి ఆ సమస్యకు సులువుగా పరిష్కారం కనుగొంటారు.
  • ఈ గుర్తు అరచేతిలో ఉన్నవారు కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుని వారిని సంతోషంగా చూసుకుంటారు. బంధువులు, స్నేహితులతో కూడా వీరు మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరుచుకుంటారని హస్త సాముద్రిక శాస్త్రం పేర్కొంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner