సెప్టెంబర్ 29, నేటి రాశి ఫలాలు-వీరికి వ్యాపారాల్లో లాభాలు, అనుకున్న పనుల్లో విజయం-today sunday september 29th rasi phalalu in telugu check all zodiac wise horoscope prediction ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 29, నేటి రాశి ఫలాలు-వీరికి వ్యాపారాల్లో లాభాలు, అనుకున్న పనుల్లో విజయం

సెప్టెంబర్ 29, నేటి రాశి ఫలాలు-వీరికి వ్యాపారాల్లో లాభాలు, అనుకున్న పనుల్లో విజయం

HT Telugu Desk HT Telugu
Sep 29, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ29.09.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 29 నేటి రాశి ఫలాలు
సెప్టెంబర్ 29 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 29.09.2024

వారం: ఆదివారం, తిథి: ద్వాద‌శి,

నక్షత్రం: మఖ, మాసం : భాద్రపదము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

మీ పట్టుదల, నేర్పరితనం ఇతరులను ఆకట్టుకుంటుంది. ఏ పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. తీర్థయాత్రలపై దృష్టి సారిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాల్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. బాధ్యతలకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ధనవ్యయ సూచ‌న‌లు ఉన్నాయి. స్వల్ప అనారోగ్యం స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌చ్చు. ఎరుపు, పసుపు రంగులు ధ‌రించండి. గణేశాష్టకం పఠించండి.

వృషభం

కార్యక్రమాలను నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. ఆదాయం మరింత పెరిగి రుణబాధలు తొలగుతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. స్వల్ప అనారోగ్యం త‌లెత్త‌వ‌చ్చు. మానసిక అశాంతి ఉండే అవ‌కాశం ఉంది. నీలం, నేరేడు రంగులు శుభ సూచికం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఆర్థిక విషయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. మీ ఊహలు నిజం కాగలవు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు, ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు. వృథా ఖర్చులు ఉండే అవ‌కాశం ఉంది. ఆకుపచ్చ, గులాబీ రంగులు ధరించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం

ప‌నులు సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకోవడమే కాదు, మీ ఆలోచనలనూ మారుస్తుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు బాధ్యతలపై మరింత శ్రద్ధ వహిస్తారు. కళాకారులకు అనుకూల పరిస్థితులు, ఆహ్వానాలు అందుతాయి. వ్యయప్రయాసలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. గులాబీ, లేత ఎరుపు రంగులు మంచి ఫ‌లితాలు అందిస్తాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. వాహనాలు కొనుగోలు, వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి. పారిశ్రామికవేత్తల యత్నాలు అనుకూలిస్తాయి. ధనవ్యయ సూచ‌న‌లు ఉన్నాయి. నీలం, ఆకుపచ్చ రంగులు ధ‌రించండి. శివస్తోత్రాలు పఠించండి.

కన్య

కొత్త కార్యక్రమాలు చేపడతారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. విలాసవంతంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు అనుకూల సమాచారం రాగలదు. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. వృథా ఖర్చులు అయ్యే అవ‌కాశం ఉంది. బంధువిరోధాలు ఏర్ప‌డ‌వ‌చ్చు. నేరేడు, తెలుపు రంగులపై దృష్టి పెట్టండి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. దూరప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారం అందుతుంది. వాహనయోగం సూచితం. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు తథ్యం. ధనవ్యయ సూచ‌న‌లు ఉన్నాయి. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు ధ‌రించండి. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం

అనుకున్న పనుల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ధన వ్యయ సూచ‌న‌లు ఉన్నాయి. గులాబీ, నేరేడు రంగులు మంచి ఫ‌లితాలు అందిస్తాయి. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

ధ‌నుస్సు

కొన్ని పనులు కొంత నెమ్మదిస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. మీ అంచనాలు నిజం కాగలవు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. శుభవార్తలు వినే అవ‌కాశం ఉంది. వాహనయోగం సూచితం. గులాబీ, పసుపు రంగులు. గణపతిని పూజించండి.

మ‌క‌రం

ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. కళాకారులకు కార్యసిద్ధి, సన్మానాలు. వృథా ఖర్చులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. అనారోగ్యం, పసుపు, తెలుపు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు వ్యవహార విజయంలో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. నుంచి ఆహ్వానాలు రాగలవు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. వివాహయత్నాలు సానుకూలం. నిరుద్యోగుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన పరిస్థితి. పారిశ్రామికవర్గాలకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యయ ప్రయాసలు ఉండే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. గులాబీ, ఎరుపు రంగులు క‌లిసి వ‌స్తాయి. శివాష్టకం పఠించండి.

మీనం

ఆర్థిక విషయాలలో చికాకు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల మిత్రులు కొంత సహాయపడతారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, రాజకీయవేత్తల యత్నాలు నత్తనడకన సాగుతాయి. శుభవార్తలు వినే అవ‌కాశం ఉంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ