Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. అంతా శుభం, ఈరోజు ఈ ఒక్క పని చేయండి!
Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తేదీ అక్టోబర్ 02, 2022. ఆదివారంకు సంబంధించి అందించిన రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకోండి.
Telugu Horoscope Today: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలితము), తేదీ: 02.10.2022
సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: ఆశ్వయుజం,
వారం: ఆదివారం, తిథి: శు. సప్తమి నక్షత్రం : జ్యేష్ఠ
మేష రాశి :
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు కలుగును. అనారోగ్య సూచన. కష్టపడితే కాని పనులు పూర్తి కాని పరిస్థితి. శత్రువుల వలన చికాకులు ఏర్పడును. పనులయందు అలసత్వం వహించెదరు. కుటుంబముతో గడిపెదరు. ఖర్చు అధికముగా ఉండును. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మేషరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు సూర్యాష్టకం పఠించండి.
వృషభ రాశి :
ఈ రోజు మధ్యస్తం నుండి అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయములపై చర్చించెదరు. ఇష్టమైన వస్తువులు కొనెదరు. ప్రయాణములు అనుకూలించును. ఆహ్లాదముగా గడిపెదరు. దూరప్రాంతపు వాళ్ళతో సంభాషణలు అనుకూలించును. శుభవార్తను వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగును. మానసిక అలసట ఏర్పడును. భేదాభిప్రాయ సూచనలు అధికముగా ఉన్నవి. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. వృషభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
మిథున రాశి :
ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. కుటుంబముతో ఆహ్లాదముగా గడిపెదరు. మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ ఏర్పడును. పనులలో చికాకులు కలుగును. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించెదరు. ధన సంబంధిత విషయాలలో ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించండి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. ప్రయాణమునందు ఖర్చులు అధికమగు సూచన. మిథునరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి.
కర్కాటక రాశి :
ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ప్రయాణములు అనుకూలించును. నూతన వస్తువులు కొనెదరు. విశ్రాంతి కలుగును. సుఖభోజన ప్రాప్తి. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. శారీరక సౌఖ్యమును పొందెదరు. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
సింహ రాశి :
ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కుటుంబములో ఆనందముగా గడిపెదరు. మృష్టాన్న భోజన ప్రాప్తి. ఆరోగ్యం అనుకూలించును. ఒత్తిళ్ళకు దూరంగా ఉండటం మంచిది. అవసరమైన వస్తువులు కొనే ప్రయత్నం చేసెదరు. మానసికంగా ప్రశాంతంగా ఉండెదరు. శత్రువర్గంతో జాగ్రత్తలు వహించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉన్నది. సింహరాశి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి.
కన్య రాశి :
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. మృష్టాన్న భోజనం, శారీరక సౌఖ్యం కలుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. కీర్తి కలుగును. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యా రాశి వారు ఈ రోజు సూర్యాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితం కలుగును.
తులా రాశి :
ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పని పూర్తి చేసెదరు. విశ్రాంతి పొందెదరు. సుఖ భోజన ప్రాప్తి. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. కుటుంబముతో చర్చలకు దూరంగా ఉండండి. సంతానము వలన సంతోషము కలుగును. తులారాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృశ్చిక రాశి :
ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించెదరు. ఇష్టమైన వస్తువుల కోసం ధనమును ఖర్చు చేసెదరు. కుటుంబ సభ్యులతో గడిపెదరు. పిల్లల వలన చికాకులు పెరుగును. మీయొక్క పనులతో ఎదుటి వారి మన్నన పొందుటకు ప్రయత్నం చేసెదరు. వృశ్చిక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి.
ధనుస్సు రాశి :
ఈ రోజు మధ్యస్త ఫలితాలున్నవి. ఖర్చు అధికమగును. కుటుంబముతో గడి పెదరు. మీకు కావలసిన వస్తువుల కోసం ధనమును ఖర్చు చేసెదరు. మీరు చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించండి. కుటుంబములో చికాకులు ఏర్పడును. శారీరక శ్రమ కలుగును. ఖర్చులు పెరుగును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. ధనుస్సు రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి :
ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ప్రయాణములు అనుకూలించును. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. కుటుంబముతో గడిపెదరు. మృష్టాన్న భోజన ప్రాప్తి. శారీరక సౌఖ్యము మరియు ప్రశాంతత కలుగును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత ఆరోగ్య విషయమునందు కుటుంబ వ్యవహారముల యందు వృత్తి వ్యాపారముల యందు జాగ్రత్తలు వహించాలి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు ఆదిత్య హృదయము, నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి.
కుంభ రాశి :
ఈ రోజు మీకు మధ్యస్థమునుండి అనుకూలంగా ఉన్నది. అవసరమైన వస్తువులు కొనడానికి ప్రయత్నం చేసెదరు. బంధుమిత్రులతో గడిపెదరు. కుటుంబములో చికాకులు ఏర్పడును. ఏలినాటి శని ప్రభావం చేత కుటుంబంలోని వారితోటి ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారికి తీవ్రముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించవలసిన సమయము. ఖర్చులు పెరుగును. రాబడి తగ్గును, శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగము కోసము చేసే ప్రయత్నాలు సఫలమయ్యే సూచన. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు ఆదిత్య హృదయము, నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి.
మీన రాశి :
ఈ రోజు మీకు అనుకూలముగా ఉన్నది. బంధుమిత్రులతో గడిపెదరు. కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనడానికి ప్రయత్నం చేస్తారు. శారీరకంగా ఉల్లాసంగా ఉండెదరు. ఆందోళనలు తగ్గును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
మొబైల్ 9494981000.
సంబంధిత కథనం