Pitru Dosham: పితృ దోషం ఉంటే మనకి కనిపించే సంకేతాలు ఇవే, నివారణ పరిహారాలు
శ్రాద్ధ పక్షంలో పితృ దేవతల శాంతికి అనేక తర్పణాలు, శ్రాద్ధ దోషాలు, పిండ ప్రదానం ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ సమయంలో, పితృ దోషం లక్షణాలను తెలుసుకొని, ఆ వ్యక్తి మోక్షం పొందడానికి దోష నివారణ పరిహారాలు చేయాలి.
పితృపక్షం జరుగుతోంది. సెప్టెంబర్ 18న మొదలైన పితృపక్షం అక్టోబర్ 2న ముగియనుంది. భాద్రపద అమావాస్యతో పితృపక్షం ముగుస్తుంది. ఈ పక్షం రోజుల్లో పూర్వీకుల ఆత్మశాంతి, మోక్షం కోసం శ్రాద్ధ తర్పణం, పిండ ప్రదానం చేస్తారు. పితృదోష నివారణకు శ్రాద్ధ పక్షం కాలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. పితృ దోషం నివారణకి అనువైన సమయంగా పరిగణిస్తారు.
పూర్వీకుల లోపాలు ఉన్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. పితృ దోషం కారణంగా ఆకస్మిక బాధలు, ధనం లేకపోవడం, ఆధ్యాత్మిక పనుల్లో ఆటంకాలు, గృహ బాధలు, పురోగతిలో ఆటంకాలు, వివాహ జాప్యం, సంపదల రాకలో ఆటంకాలు, విద్యలో ఆటంకాలు
ఆత్మవిశ్వాసం లేకపోవడం, వంశాభివృద్ధిలో ఆటంకం, భయానక కలలు, మానసిక అశాంతి, కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురికావడం, జీవితంలో ఇబ్బందులు పడటం ఇలాంటి అనేక సమస్యలను పితృ దోష లక్షణాలుగా భావిస్తారు. పితృ దోషాన్ని వదిలించుకునే సులువైన మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.
పితృ దోషం నివారణకు పరిహారాలు
పితృ దోషం నివారణకు పితృదేవతల తర్పణం, పిండ దానం, శ్రాద్ధం, దానధర్మాలు శ్రద్ధాపక్షంలో చేయాలి.
పితృ దోషం నుండి ఉపశమనం పొందడానికి చార్ ధామ్ తీర్థయాత్రల్లో చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు.
కాకి, పక్షి, ఆవు, కుక్కకు రొట్టె తినిపించాలి. రావిచెట్టుకు నీరు సమర్పించాలి.
పితృ దోష నివారణకు రాహుకాలంలో శివుడిని పూజించాలి. అంతేకాకుండా ప్రతి నెలా అమావాస్య రోజున పితృ దేవతలకు నైవేద్యాలు సమర్పించాలి.
పితృ దోషం నుండి ఉపశమనం పొందడానికి, శ్రద్దాపక్షంలో భగవద్గీతను పఠించడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
శ్రాద్ధా పక్షంలో పూర్వీకుల శాంతి కోసం నీరు, తర్పణం, పిండ ప్రదానంతో పాటు మీ పూర్వీకుల పట్ల నిజమైన గౌరవాన్ని ప్రదర్శించండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్