Lucky Zodiacs : బుధుడు వల్ల ఆ మూడు రాశుల వారికి అదృష్టం-lucky zodiac signs september horoscope because of mercury transits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Lucky Zodiac Signs September Horoscope Because Of Mercury Transits

Lucky Zodiacs : బుధుడు వల్ల ఆ మూడు రాశుల వారికి అదృష్టం

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 02, 2022 09:48 AM IST

Lucky Zodiacs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో అనేక రాశుల వారు మంచి సమయాన్ని చూడబోతున్నారు. బుధుడు తిరోగమనం వల్లనే కొందరికి అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు. మరి ఈ నెలలో ఏ రాశుల వారు సంతోషంగా ఉండబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బుధుడి వల్ల ఆ రాశులు వారికి అదృష్టం
బుధుడి వల్ల ఆ రాశులు వారికి అదృష్టం

Lucky Zodiacs : దుర్గాపూజ (నవరాత్రి) 2022కి ముందు.. సెప్టెంబరులో అనేక రాశుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సెప్టెంబర్ 10 నుంచి బుధుడు తిరోగమనం వైపు వెళ్తున్నాడు. దాని ప్రభావం అనేక రాశులపై ఉంటుందని అంటున్నారు జ్యోతిష్యులు.

ట్రెండింగ్ వార్తలు

బుధుడు మేధస్సు, వ్యాపారం, వాక్కులకు కారకుడు. ఫలితంగా బుధుడు మంచి స్థానంలో ఉన్నవాళ్లు ప్రతిభ, తెలివితేటల విషయంలో చాలా ముందుంటారని జ్యోతిష్యం చెప్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతిభ, తెలివితేటలే కాకుండా.. సెప్టెంబర్‌లో అదృష్టానికి సంబంధించిన వివిధ అంశాలలో మంచి సమయాన్ని కలిగి ఉంటారని చెప్తుంది.

సింహ రాశి

సింహ రాశి వారు బుధ గ్రహ సంచారము వలన మంచి రోజులు చూడబోతున్నారు. ఆ రాశి రెండవ స్థానంలో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. ఫలితంగా వారు డబ్బుకు సంబంధించిన అన్ని అంశాల్లో ప్రయోజనం పొందుతారు.

సింహరాశిపై ప్రభావాలు

ఈ సమయంలో సింహ రాశి వారు ఆకస్మిక సంపదను పొందుతారు. ఏదైనా ముఖ్యమైన వ్యాపార ఒప్పందం లేదా సంతకం చేసిన ఒప్పందం ప్రభావవంతంగా మారుతుంది. మీరు విజయం పొందుతారు. భాగస్వామ్య పనుల వల్ల విజయం లభిస్తుంది. మార్కెటింగ్, లా, టీచింగ్ వంటి మాట్లాడే వృత్తులలో నిమగ్నమైన వారందరికీ సంతోషకరమైన సమయం ఉంటుంది.

వృశ్చికరాశి

బుధుడు వృశ్చికరాశిలో 11వ స్థానంలో ఉంటాడు. ఇది లాభం, ఆదాయ ప్రదేశంగా చెప్తారు. ఫలితంగా సెప్టెంబరు 10 తర్వాత వృశ్చిక రాశి వారికి మంచి లాభాలు, ఆదాయ గణాంకాలు ఉంటాయి. ఈ సమయంలో వ్యాపారం మెరుగుపడుతుంది. ఆదాయ వనరు పెరుగుతుంది.

ధనుస్సు

బుధుడు ధనుస్సు రాశిలో 10వ స్థానంలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ సమయంలో ఉద్యోగం, వ్యాపార స్థానం బాగుంటుంది. అంతేకాకుండా ధనుస్సు రాశి ఉద్యోగులకు కూడా ఈ సెప్టెంబర్‌లో పదోన్నతులు లభించే అవకాశం ఉంది.

ధనుస్సు రాశిపై ప్రభావం

మీరు వ్యాపారంలో కొత్త సంబంధాల వల్ల లాభపడతారు. ఉద్యోగుల పదోన్నతుల మధ్య బలమైన సంబంధం ఉంటుంది. ధనుస్సు రాశి వారు పనిలో అభివృద్ధిని చూస్తారు. తండ్రితో అనుబంధం బాగుంటుంది. మీరు చేసే పనిలో ప్రశంసలు పొందుతారు. ఈ సమయంలో మీరు కారు లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు.

(ఈ కథనంలో ఉన్న సమాచారం ప్రామాణికతను తెలుగు హిందూస్తాన్ టైమ్స్ ధృవీకరించలేదు. నిపుణుల ద్వారా తెలుసుకున్న సమాచారాన్నే ప్రామాణికతగా తీసుకోండి.)

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్