Jupiter Transit: జాక్ పాట్! గురు సంచారంలో మార్పుతో ఈ మూడు రాశుల వారికి ఏప్రిల్ నెల వరకూ డబ్బే డబ్బు
Jupiter Transit: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని అత్యంత అనుకూలమైన గ్రహంగా భావిస్తారు. గురు సంచారంలో మార్పు ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. నవంబరు 28న బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. రోహిణీ నక్షత్రంలో గురు సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.
బృహస్పతిగా పిలుచుకునే గురు గ్రహం తొమ్మిది గ్రహాలలో అత్యంత అనుకూలమైన, పవిత్రమైన గ్రహం.సంపద, సంతానం, శ్రేయస్సు, వివాహానికి కారకుడు గురువు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం గురు భగవానుడు సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చుతాడు. 2024 మే 1న మేష రాశి నుంచి వృశభ రాశిలోకి ప్రవేశించిన గురు ఈ సంవత్సరం పొడవునా అదే రాశి చక్రంలో సంచరిస్తాడు. బృహస్పతి తన రాశిచక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ సమయంలో గురు గ్రహం తన నక్షత్రాన్ని మారుస్తూ సంచరిస్తాడు.
ఈ ఏడాది నవంబర్ 28న బృహస్పతి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు.ఇది చంద్ర దేవుడికి చెందిన నక్షత్రం.ఇప్పటి నుంచి 10 ఏప్రిల్ 2025 వరకు గురు గ్రహం ఇదే నక్షత్రంలో సంచరిస్తుంది. రోహిణి నక్షత్రంలో గురు సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపించినప్పటికీ మూడు రాశుల వారికి మాత్రం అంతులేని శుభ ఫలితాలను అందిస్తుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.
వృషభ రాశి:
గురు భగవానుడు రోహిణి నక్షత్రంలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు.కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి.కొత్త అవకాశాలు లభిస్తాయి. చాలా కాలంగా చేస్తున్న పనులన్నీ విజయవంతమవుతాయి.సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతాయి.వ్యక్తిగత జీవితం చాలా బాగుటుంది. ఆర్థికంగా గొప్ప పురోగతిని పొందవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది.అదృష్టం అన్నింటా మీకు తోడుంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.
కర్కాటక రాశి:
రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి మంచి పురోగతిని ఇస్తుంది.అన్ని రకాలుగా అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు పనిచేసే చోట పదోన్నతి, వేతన పెంపు జరగవచ్చు. మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. బంధువుల వల్ల ఏర్పడిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ధనానికి కొదవ ఉండదు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.
సింహ రాశి:
గురు భగవానుడు రోహిణీ నక్షత్ర సంచారం సింహ రాశి వారికి వివిధ రకాల యోగాలు తెచ్చిపెడుతుంది. ఉద్యోగం, వ్యాపారాలు అన్నింటిలో మంచి లాభాలు దక్కుతాయి.చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు లభిస్తాయి. నూతన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి.నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పనిచేసే చోట పైఅధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు. ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.