Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : జనవరి 25వ తేదీన ఏ రాశివారికి ఎలా ఉందంటే..-daily horoscope in telugu check astrological predictions for 25th january 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : జనవరి 25వ తేదీన ఏ రాశివారికి ఎలా ఉందంటే..

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : జనవరి 25వ తేదీన ఏ రాశివారికి ఎలా ఉందంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 25, 2023 01:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? జనవరి 25వ తేదీ 2023న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (25-01-2023) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు మేషరాశి ఫలాలు

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి అధికమగును. వాగ్వివివాదానికి దూరంగా ఉంటే మంచిది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు కలిగే సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు వృషభరాశి ఫలాలు

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తను వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగుతుంది. శారీరక శ్రమ కొంత అధికముగా ఉంటుంది. మానసిక అలసట ఏర్పడుతుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉంటాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ఈరోజు మిధునరాశి ఫలాలు

ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక సౌఖ్యము కలుగును. మీకృషి, శ్రమ చేత ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడును. ప్రయాణములో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు కర్కాటకరాశి ఫలాలు

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఖర్చు ఎక్కువగా ఉంటాయి. శారీరక సౌఖ్యమును పొందుతారు. చేసే ప్రతి పనిని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కర్కాటక రాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ఈరోజు సింహరాశి ఫలాలు

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు కన్యారాశి ఫలాలు

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి పెరుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉండును. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కన్యారాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ఈరోజు తులా రాశి ఫలాలు

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరించడం మంచిది. శరీర సౌఖ్యం ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యము కలుగును. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రుల హెల్ప్ చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం తులారాశి వారు మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు వృశ్చిక రాశి ఫలాలు

ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. శత్రువులతో జాగ్రత్త వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం వృశ్చికరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ఈరోజు ధనూ రాశి ఫలాలు

ఈరోజు మీకు మద్యస్తమునుంచి అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతీ పనిలో ఆచితూచి వ్యవహరించండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడుతాయి. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు మకర రాశి ఫలాలు

ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేసే ప్రతి పనిపై ఉంటుంది. ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం మకరరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ఈరోజు కుంభ రాశి ఫలాలు

ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలోని వారితోటి ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉన్నది. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరించవలసిన సమయముంది. శత్రువుల బాధలు అధికముగా ఉంటాయి. ఉద్యోగస్తులకు సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు మీన రాశి ఫలాలు

ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితములున్నాయి. కుటుంబ సౌఖ్యము కలుగును. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. ఆందోళన కలుగును. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మీన రాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్