తెలుగు న్యూస్ / ఫోటో /
Yashaswi Jaiswal: యశస్వి జైస్వాల్ 45 ఏళ్ల రికార్డు బ్రేక్.. ఒక కేలండర్ ఏడాదిలో వేగంగా 1000 పరుగులు
- Yashaswi Jaiswal: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 45 ఏళ్ల కిందటి రికార్డును బ్రేక్ చేశాడు. ఈ కేలండర్ ఏడాదిలో యశస్వి 1000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు.
- Yashaswi Jaiswal: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 45 ఏళ్ల కిందటి రికార్డును బ్రేక్ చేశాడు. ఈ కేలండర్ ఏడాదిలో యశస్వి 1000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు.
(1 / 5)
Yashaswi Jaiswal: న్యూజిలాండ్ తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేసి ఔటైన యశస్వి జైస్వాల్.. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
(2 / 5)
Yashaswi Jaiswal: పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ప్రస్తుత కేలండర్ ఇయర్లో 1000 టెస్టు పరుగులు పూర్తి చేశాడు. 2024లో ఇప్పటివరకు 10 టెస్టుల్లో 18 ఇన్నింగ్స్ ఆడి 59.23 సగటుతో 1007 పరుగులు చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో యశస్వి రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్ 214 నాటౌట్.
(3 / 5)
Yashaswi Jaiswal: టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్ గా యశస్వి నిలిచాడు. దిలీప్ వెంగ్ సర్కార్ 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. వెంగ్ సర్కార్ 1979లో తొలిసారిగా ఒక సంవత్సరంలో 1000 పరుగుల మైలురాయిని దాటాడు. అప్పటికి అతని వయసు 23 ఏళ్లు. ఇప్పుడు 22 ఏళ్ల వయసులో యశస్వి ఈ ఘనత సాధించాడు.
(4 / 5)
Yashaswi Jaiswal: ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ తర్వాత టెస్టుల్లో 1000 పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 14 టెస్టుల్లో 24 ఇన్నింగ్స్ ఆడిన రూట్ మొత్తం 1305 పరుగులు చేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ మూడో స్థానంలో నిలిచాడు. 2024లో ఇప్పటివరకు 14 టెస్టుల్లో 25 ఇన్నింగ్స్ లో 957 పరుగులు చేశాడు.
ఇతర గ్యాలరీలు