తెలుగు న్యూస్ / ఫోటో /
WTC Points Table: డబ్ల్యూటీసీ టేబుల్లో మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా
- WTC Points Table: సౌతాఫ్రికాపై కేప్‌టౌన్ టెస్టులో చారిత్రక విజయం తర్వాత డబ్ల్యూటీసీ టేబుల్లో మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. తొలి టెస్టులో ఓడి, స్లోఓవర్ రేట్ కారణంగా రెండు పాయింట్లు కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయిన ఇండియన్ టీమ్.. రెండో టెస్ట్ విజయంతో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది.

(1 / 7)
WTC Points Table: సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలన్న కల కలగానే మిగిలిపోయినా.. కేప్‌టౌన్ లో ఇప్పటి వరకూ సాధ్యం కాని విజయాన్ని అందుకొని సిరీస్ 1-1తో డ్రా చేసుకుంది టీమిండియా. రెండో టెస్ట్ లో విజయంతో మరోసారి డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.(PTI)
(2 / 7)
WTC Points Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో ఇప్పటి వరకూ 4 టెస్టులు ఆడిన టీమిండియా రెండు గెలిచి, ఒకటి ఓడింది. మరొకటి డ్రా అయింది. దీంతో 26 పాయింట్లు, 54.16 పర్సెంటేజ్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.(REUTERS)
(3 / 7)
WTC Points Table: ఇక ఇండియా చేతుల్లో రెండో టెస్ట్ ఓడిన సౌతాఫ్రికా 2 టెస్టుల్లో ఒక విజయం, ఒక పరాజయంతో 12 పాయింట్లు, 50 పర్సెంటేజ్ తో రెండో స్థానానికి పడిపోయింది.(REUTERS)
(4 / 7)
WTC Points Table: న్యూజిలాండ్ టీమ్ కూడా ఈ సైకిల్లో 2 టెస్టులు ఆడి ఒకదాంట్లో గెలిచి, మరొకటి ఓడి 12 పాయింట్లు, 50 పర్సెంటేజ్ తో మూడో స్థానంలో ఉంది.(AP)
(5 / 7)
WTC Points Table: తాజా డబ్ల్యూటీసీ సైకిల్లో అందరి కంటే ఎక్కువగా ఏడు టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. 4 గెలిచి, 2 ఓడింది. ఒకటి డ్రాగా ముగిసింది. 42 పాయింట్లు, 50 పర్సెంటేజ్ తో ఆ టీమ్ నాలుగో స్థానంలో ఉంది.(AFP)
(6 / 7)
WTC Points Table: ఇక న్యూజిలాండ్ పై రెండు టెస్టుల్లో ఒకటి గెలిచిన బంగ్లాదేశ్ 12 పాయింట్లు, 50 పర్సెంటేజ్ తో ఐదో స్థానంలో కొనసాగుతోంది.(AFP)
ఇతర గ్యాలరీలు