తెలుగు న్యూస్ / ఫోటో /
WTC Points Table: న్యూజిలాండ్‌ను ఓడించిన శ్రీలంక.. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో భారీ మార్పులు
- WTC Points Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల టేబుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ను చిత్తు చేసి శ్రీలంక.. ఈ టేబుల్లో మూడో స్థానంలోకి దూసుకెళ్లగా.. కివీస్ నాలుగో స్థానంలో ఉన్నారు.
- WTC Points Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల టేబుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ను చిత్తు చేసి శ్రీలంక.. ఈ టేబుల్లో మూడో స్థానంలోకి దూసుకెళ్లగా.. కివీస్ నాలుగో స్థానంలో ఉన్నారు.
(1 / 5)
WTC Points Table: స్వదేశంలో న్యూజిలాండ్ ను తొలి టెస్టులోనే శ్రీలంక మట్టి కరిపించింది. దీంతో డబ్ల్యూటీసీ టేబుల్లో భారీ మార్పులే జరిగాయి. మ్యాచ్ లో గెలిచిన శ్రీలంక మూడో స్థానానికి దూసుకురాగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది.(AFP)
(2 / 5)
WTC Points Table: గాలె టెస్టులో న్యూజిలాండ్ ను ఓడించి శ్రీలంక 12 పాయింట్లు సాధించింది. 8 మ్యాచుల్లో 50.00 విజయాల శాతంతో 48 పాయింట్లు సాధించింది. లీగ్ పట్టికలో శ్రీలంక ఒక స్థానం మెరుగుపరుచుకుంది. నాలుగు నుంచి మూడులోకి వెళ్లింది.(AFP)
(3 / 5)
WTC Points Table: గాలే టెస్టులో శ్రీలంక చేతిలో ఓడిన తర్వాత న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో కిందికి దిగింది. మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం కివీస్ 42.85 విజయాల శాతంతో 36 పాయింట్లు సాధించింది. (AP)
(4 / 5)
WTC Points Table: ఈ డబ్ల్యూటీసీ టేబుల్లో టీమిండియా టాప్ లోనే కొనసాగుతోంది. ఆదివారం (సెప్టెంబర్ 22) బంగ్లాదేశ్ తో జరిగిన చెన్నై టెస్టులో విజయం సాధించి భారత్ విలువైన 12 పాయింట్లు సాధించింది. ఫలితంగా 10 మ్యాచ్ లలో టీమిండియా 86 పాయింట్లు సాధించింది. ఇక ఇండియా విజయాల శాతం 71.67గా ఉంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది. ఆ టీమ్ 90 పాయింట్లు, 62.5 విజయాల శాతంతో ఉంది.(PTI)
(5 / 5)
WTC Points Table: డబ్ల్యూటీసీ టేబుల్లో ఇంగ్లాండ్ ఐదో స్థానంలో ఉంది. 16 మ్యాచ్ లలో బ్రిటీష్ జట్టు 42.19 శాతం విజయాలు, 81 పాయింట్లు సాధించింది. బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 7 మ్యాచ్ లలో 33 పాయింట్లు సాధించింది. 39.29 విజయాల శాతంతో ఉంది. సౌతాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్ ఏడు, ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి.(PTI)
ఇతర గ్యాలరీలు