Health Benefits of Smiling: నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా?-world smile day special story surprising health benefits of smiling ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Health Benefits Of Smiling: నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా?

Health Benefits of Smiling: నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా?

Oct 07, 2022, 03:37 PM IST Geddam Vijaya Madhuri
Oct 07, 2022, 03:37 PM , IST

  • World Smile Day : సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ అన్నా.. ఓ నవ్వు చాలు అంటూ పాడినా.. అది మన సంతోషం కోసమే. నవ్వు నాలుగు విధాల చేటు అంటారు కానీ.. సంతోషంగా నవ్వుతూ ఉంటే మన ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రపంచ చిరునవ్వు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి శుక్రవారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన మొదటి శుక్రవారం వచ్చింది. దీనిని మొదటిసారిగా 1999లో జరిపారు. ఈ సంవత్సరం థీమ్ "Do an act of kindness. Help one person smile." 

(1 / 6)

ప్రపంచ చిరునవ్వు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి శుక్రవారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన మొదటి శుక్రవారం వచ్చింది. దీనిని మొదటిసారిగా 1999లో జరిపారు. ఈ సంవత్సరం థీమ్ "Do an act of kindness. Help one person smile." (Unsplash)

ఒత్తిడిని తగ్గిస్తుంది: చిరునవ్వు ఒత్తిడితో పోరాడటానికి న్యూరోపెప్టైడ్స్ అనే చిన్న అణువులను విడుదల చేస్తుంది. మీరు రోజూ ఆందోళనను ఎదుర్కొంటే, రక్తప్రవాహంలో ఒత్తిడి-ప్రేరిత హార్మోన్లను తగ్గించడానికి మీరు మరింత నవ్వుతూ ఉండాలి.

(2 / 6)

ఒత్తిడిని తగ్గిస్తుంది: చిరునవ్వు ఒత్తిడితో పోరాడటానికి న్యూరోపెప్టైడ్స్ అనే చిన్న అణువులను విడుదల చేస్తుంది. మీరు రోజూ ఆందోళనను ఎదుర్కొంటే, రక్తప్రవాహంలో ఒత్తిడి-ప్రేరిత హార్మోన్లను తగ్గించడానికి మీరు మరింత నవ్వుతూ ఉండాలి.(Unsplash)

జీవిత కాలం పెరుగుతుంది : తరచుగా నవ్వడం వల్ల మీరు జీవితంలో మరిన్ని సంవత్సరాలు పెంచుకోవచ్చు. నవ్వుతూ, హ్యాపీగా ఉండే వ్యక్తులు ఎక్కువ కాలం జీవించవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

(3 / 6)

జీవిత కాలం పెరుగుతుంది : తరచుగా నవ్వడం వల్ల మీరు జీవితంలో మరిన్ని సంవత్సరాలు పెంచుకోవచ్చు. నవ్వుతూ, హ్యాపీగా ఉండే వ్యక్తులు ఎక్కువ కాలం జీవించవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.(Unsplash)

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: మీరు బలహీనంగా ఉన్నప్పుడు నవ్వడానికి ప్రయత్నించండి. అది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని మంచి మానసిక స్థితిలో ఉంచుతుంది.

(4 / 6)

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: మీరు బలహీనంగా ఉన్నప్పుడు నవ్వడానికి ప్రయత్నించండి. అది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని మంచి మానసిక స్థితిలో ఉంచుతుంది.(Unsplash)

రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది : చిరునవ్వు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్ డోపమైన్‌ను యాక్టివేట్ చేసి, యాంటీబాడీస్, ఇతర అనారోగ్యాన్ని చంపే కణాల ఉత్పత్తిని పెంచడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

(5 / 6)

రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది : చిరునవ్వు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్ డోపమైన్‌ను యాక్టివేట్ చేసి, యాంటీబాడీస్, ఇతర అనారోగ్యాన్ని చంపే కణాల ఉత్పత్తిని పెంచడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేస్తుంది.(Unsplash)

రక్తపోటును తగ్గిస్తుంది: నవ్వడం వల్ల హృదయ స్పందన రేటు, శ్వాసను పెంచడం ద్వారా రక్తపోటును తగ్గుతుంది.

(6 / 6)

రక్తపోటును తగ్గిస్తుంది: నవ్వడం వల్ల హృదయ స్పందన రేటు, శ్వాసను పెంచడం ద్వారా రక్తపోటును తగ్గుతుంది.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు