world cup 2023 points table: వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచినా రెండో స్థానంలోనే ఇండియా.. ఎందుకలా?-world cup 2023 points table india remain in 2nd place despite 4th consecutive win ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  World Cup 2023 Points Table: వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచినా రెండో స్థానంలోనే ఇండియా.. ఎందుకలా?

world cup 2023 points table: వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచినా రెండో స్థానంలోనే ఇండియా.. ఎందుకలా?

Oct 19, 2023, 10:39 PM IST Hari Prasad S
Oct 19, 2023, 10:39 PM , IST

  • world cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచినా రెండో స్థానంలోనే కొనసాగుతోంది టీమిండియా. టాప్ ప్లేస్ లో న్యూజిలాండ్ ఉంది. నెట్ రన్ రేట్ విషయంలో కివీస్ ను ఇండియా అధిగమించలేకపోయింది.

world cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి టీమిండియా వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకుంది. 4 మ్యాచ్ లలో 8 పాయింట్లు, 1.659 నెట్ రన్‌రేట్ తో ఇండియా పాయింట్ల టేబుల్లో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇండియా ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై గెలిచిన విషయం తెలిసిందే.

(1 / 10)

world cup 2023 points table: ఇక వరల్డ్ కప్ లో ఇండియాలాగే ఓటమెరగని న్యూజిలాండ్ కూడా 4 మ్యాచ్ లలో 8 పాయింట్లతో టాప్ లో ఉంది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ (1.923) ఇండియాతో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఆదివారం (అక్టోబర్ 22) ఈ రెండు టీమ్స్ తలపడబోతున్నాయి.

(2 / 10)

world cup 2023 points table: సౌతాఫ్రికా టీమ్ మూడో స్థానంలో ఉంది. ఆ టీమ్ 3 మ్యాచ్ లలో 4 పాయింట్లు, 1.385 నెట్ రన్ రేట్ తో ఉంది. తొలి రెండు మ్యాచ్ లలో గెలిచిన ఆ టీమ్.. నెదర్లాండ్స్ చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే.

(3 / 10)

world cup 2023 points table: ఇండియా చేతుల్లో ఓడినా కూడా పాకిస్థాన్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 3 మ్యాచ్ లలో 4 పాయింట్లు, -0.137 నెట్ రన్ రేట్ తో ఆ టీమ్ 4వ స్థానంలో ఉంది. శుక్రవారం (అక్టోబర్ 20) ఆస్ట్రేలియాతో కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది.

(4 / 10)

world cup 2023 points table: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 3 మ్యాచ్ లలో ఒకటి గెలిచి, రెండు ఓడిపోయి 2 పాయింట్లతో ఐదోస్థానంలో ఉంది.

(5 / 10)

world cup 2023 points table: ఐదుసార్లు ఛాంపియన్ మూడు మ్యాచ్ లలో తొలి రెండు ఓడి, తర్వాత ఒకటి గెలిచి ఆరో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ తో పోలిస్తే ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ కాస్త తక్కువగా ఉంది.

(6 / 10)

world cup 2023 points table: ఇండియా చేతుల్లో ఓడిన బంగ్లాదేశ్.. 4 మ్యాచ్ లలో కేవలం ఒక విజయంతో ఏడో స్థానంలో ఉంది.

(7 / 10)

world cup 2023 points table: అనూహ్యంగా సౌతాఫ్రికాను చిత్తు చేసి సంచలనం సృష్టించిన నెదర్లాండ్స్ టీమ్ 3 మ్యాచ్ లలో ఒక విజయం, రెండు ఓటములతో 8వ స్థానంలో ఉంది.

(8 / 10)

world cup 2023 points table: ఆఫ్ఘనిస్థాన్ 4 మ్యాచ్ లలో ఒకే విజయంతో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.

(9 / 10)

world cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో ఇప్పటి వరకూ విజయాల బోణీ చేయని టీమ్ శ్రీలంక. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఓడి చివరి స్థానంలో కొనసాగుతోంది.

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు