తెలుగు న్యూస్ / ఫోటో /
Winter care with Ayurveda: వంటింట్లో దొరికే ఈ ఐదు వస్తువులు ఆయుర్వేద అద్భుతాలు..
- Winter care with ayurveda: శీతాకాలం లో జబ్బులు విజృంభిస్తుంటాయి. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వీటన్నింటికీ పరిష్కారం మన వంటింట్లోనే ఉంది.
- Winter care with ayurveda: శీతాకాలం లో జబ్బులు విజృంభిస్తుంటాయి. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వీటన్నింటికీ పరిష్కారం మన వంటింట్లోనే ఉంది.
(1 / 6)
చలికాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం సర్వసాధారణం. దీంతో పాటు గుండె జబ్బులు, మధుమేహం కూడా పెరుగుతాయి. ఈ సీజన్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ ఇంట్లో ఈ 5 మూలికలు ఉంటే, వాటిని ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
(2 / 6)
తులసి ఆకులను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. రోజూ ఒక చెంచా తులసి ఆకుల రసం తాగడం మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
(3 / 6)
అల్లంలో జింజెరాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది వికారం మరియు వాంతులు వంటి సమస్యలను నివారిస్తుంది. గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి వాటికి అల్లం కషాయం ఉత్తమం. కాబట్టి చలికాలంలో రోజూ అల్లం టీ తాగండి.
(4 / 6)
వేప ఆకులను కూడా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వేప కషాయం తాగడం వల్ల ఆర్థరైటిస్ వంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మధుమేహం, రక్తపోటు కూడా అదుపులో ఉంటాయి.
(5 / 6)
ఆయుర్వేదంలో అశ్వగంధకు ప్రత్యేక స్థానం ఉంది. దీని పొడిని నీళ్లలో కలిపి తాగడం వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని నివారిస్తుంది. ఇది నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.
ఇతర గ్యాలరీలు