తెలుగు న్యూస్ / ఫోటో /
Visakha Steel Plant Protest : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన, ఉద్యోగ సంఘాల నేతలు అరెస్ట్
- Visakha Steel Plant Protest : విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
- Visakha Steel Plant Protest : విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
(1 / 8)
విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
(2 / 8)
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదని ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
(3 / 8)
ఆందోళన చేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
(4 / 8)
విశాఖపట్నం కూర్మన్నపాలెం జంక్షన్‌లో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
(5 / 8)
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.
(6 / 8)
కూర్మన్నపాలెం జంక్షన్ జాతీయ రహదారిపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు బైఠాయించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, 78వ వార్డు కార్పొరేటర్ బి.గంగారావు, ఉద్యోగ నేతలు ఎం.రామారావుతో పాటు 150 మంది ఉద్యోగ సంఘ నేతలు, కార్మిక సంఘ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
(7 / 8)
విశాఖ జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు స్టీల్‌ప్లాంట్ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు.
ఇతర గ్యాలరీలు