Vastu Tips for pooja room: పూజ గది నియమాలు.. అలా దేవుళ్ళను ఉంచడం మహా పాపం!
- Vastu Tips for pooja room: హిందు అచారంలో దైవారాధనకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. దైవబలం తోడుగా ఉంటే ప్రతి పనిలో విజయం సాధిస్తామనే నమ్మకంతో పాటు ప్రశాంతత కోసం దైవారాధన చేస్తూ ఉంటారు. అందుకోసం ప్రతి ఇంట్లో దేవుడి గది తప్పకుండా ఉంటుంది. అయితే ఇంట్లో అన్ని దిశలకు వాస్తు ఉన్నంటూ.. పూజా గదికి కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి.

(1 / 5)
వాస్తు శాస్త్రంలో ప్రతి ఇంట్లోని ప్రతి గదికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాస్తు ప్రకారంగా ఇంట్లో కొన్ని వస్తువులను సరైన స్థలంలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో కావలసిన ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు.
(2 / 5)
కుటుంబం, వ్యక్తిగత జీవితంలో శ్రేయస్సు, డబ్బు, సంతోషం కలగాలని చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదిలో దేవుడి కొలిచే సమయంలో సరైన నియమాలు పాటిస్తేనే శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా దేవుడి గదిలో ఉంచే దేవతల విగ్రహాలు సరైన దిశలో ఉంచినప్పుడు పూజ ఫలాలు దక్కుతాయి
(3 / 5)
పీఠంపై దేవుళ్ళ, దేవతల చిత్రాలను ఎలా ఉంచాలి: పీఠంపై దేవుళ్ళ చిత్రాలను ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. పూజ సామగ్రిని దిగువన ఉంచాలి. దీపాలు, గంటలు, శంఖములను పూజా సామాగ్రిలో తప్పనిసరిగా చేర్చాలి.
(4 / 5)
దేవతలను ఏ దిక్కున ఉంచాలి: పీఠంపై ముగ్గురు దేవతలను ఒకే చోట ఉంచవద్దు. అయితే దుర్గ, లక్ష్మి, సరస్వతి విగ్రహాలను ఒకే వైపు ఉంచితే మాత్రం చాలా మంచిది. అలాగే వినాయక రూపంలో ఉండే విగ్రహాలను ఒకే చోట ఉంచడం శ్రేయస్కరం కాదు. ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలను ఉంచకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే గోపాలుడి విగ్రహం ఉండొచ్చు కానీ కృష్ణుడి విగ్రహం ఉంటే వాస్తుశాస్త్రం ప్రకారం దానితో పాటు రాధ విగ్రహాన్ని కూడా ఉంచుకోవాలి.
ఇతర గ్యాలరీలు