తెలుగు న్యూస్ / ఫోటో /
Christmas 2022 Gift Ideas| క్రిస్మస్ వేళ మీ ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వాలా?
- Christmas 2022 gift ideas: క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. ఈ పండగ సందర్భంగా మీ ప్రియమైన వారి కోసం మీరు సీక్రెట్ సాంటాక్లాస్ అవతారం ఎత్తి వారికి బహుమానాలు పంపాలనుకుంటే, ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐడియాలు అందిస్తున్నాం చూడండి.
- Christmas 2022 gift ideas: క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. ఈ పండగ సందర్భంగా మీ ప్రియమైన వారి కోసం మీరు సీక్రెట్ సాంటాక్లాస్ అవతారం ఎత్తి వారికి బహుమానాలు పంపాలనుకుంటే, ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐడియాలు అందిస్తున్నాం చూడండి.
(1 / 6)
క్రిస్మస్ వేడుక అంటే బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో ఆనందంగా సమయం గడపడం. మధురమైన రుచులను ఆస్వాదించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం. బహుమతుల విషయంలో మీకు అవగాహన లేకపోతే ఈ ఐడియాలు చూడండి. (Unsplash)
(2 / 6)
క్యూరేటెడ్ చాక్లెట్ హాంపర్: స్వీట్స్ ఇష్టపడేవారికి ఎవరికైనా ఇది సరైన క్రిస్మస్ బహుమతి. పెట్టెలో వారికి ఇష్టమైన చాక్లెట్‌లను అమర్చడం బహుమానంగా ఇవ్వవచ్చు. దీనితో పాటు ఒక గ్రీటింగ్ కార్డ్ అందించడం ద్వారా మీ మహుమతిని మరింత ప్రత్యేకంగా చేయండి.(Unsplash)
(3 / 6)
కూల్ గాడ్జెట్‌లు: మీ సర్కిల్‌లో మీకు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బడ్డీస్ ఉంటే, మీరు వారికి మంచి హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్, కెమెరా, స్పీకర్లు మొదలైన వస్తువులను అందించడం ద్వారా వారిని ఆకట్టుకోవచ్చు.(Unsplash)
(4 / 6)
ఆభరణాలు: నగలు, ఆభరణాలను ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. వారికి నచ్చేలా కస్టమైజ్డ్ నెక్లెస్ లేదా బ్రాస్‌లెట్‌లను బహుమతిగా ఇస్తే చాలా సంతోషిస్తారు.(Unsplash)
(5 / 6)
స్నీకర్స్: ఒక జత కూల్ స్నీకర్‌లను కూడా మీరు బహుమతిగా ఇవ్వవచ్చు. ఇవి వారికి ఉపయోగపడతాయి, మీరిచ్చినట్లు గుర్తుండిపోతుంది. (Unsplash)
ఇతర గ్యాలరీలు