Hyderabad Regional Ring Road : ఆ తర్వాతనే 'రీజినల్ రింగురోడ్డు' నిర్మాణం - పార్లమెంట్ లో కీలక ప్రకటన
- Hyderabad Regional Ring Road : హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు ఆయనకు బదులిచ్చారు.
- Hyderabad Regional Ring Road : హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు ఆయనకు బదులిచ్చారు.
(1 / 6)
తెలంగాణకు మరో మణిహారంగా రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిలవనుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ను 348 కిలోమీటర్ల పొడవున రెండు భాగాలుగా (ఉత్తర, దక్షిణ) నిర్మించనున్నారు. దీనికి పది వేల ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ కూడా షురూ అయింది.(Image Source From Twitter)
(2 / 6)
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు పడగా… తాజాగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై మరింత ఫోకస్ పెట్టింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని… ఉత్తర భాగమే కాకుండా, త్వరితగతిన దక్షిణ భాగంలోనూ పనులు ప్రారంభించాలని చూస్తోంది.(Image Source From Twitter)
(3 / 6)
కీలకమైన రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లోక్ సభలో పలు ప్రశ్నలు అడగగా… కేంద్ర రహదారుల శాఖ మంత్రి నీతిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. (Image Source From Twitter)
(4 / 6)
తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేసి ఇచ్చాకే రింగురోడ్డు నిర్మాణం చేపడతామని నీతిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టూ.. రూ.17 వేల కోట్ల విలువైన రింగురోడ్డు ప్రాజెక్టును మంజూరు చేశామని తెలిపారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ తామే చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఆ వ్యయంలో 50 శాతం భరిస్తామని స్పష్టం చేసిందన్నారు(Image Source From Twitter)
(5 / 6)
తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసిన తర్వాతే హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగు రోడ్డు నిర్మిస్తామని గడ్కరీ తెలిపారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణకు నెల రోజుల్లోపు పనులు ప్రారంభమవుతాయని వివరించారు.(Image Source From Twitter)
(6 / 6)
హైదరాబాద్‌కు చుట్టూ 60 - 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతోపాటు భూసేకరణ, ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి.మొత్తంగా 342 కిలోమీటర్ల పొడవుతో రింగ్ రోడ్డు ఉంటుంది. ఉత్తర భాగం 160 కిలోమీటర్ల మేర.. దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందనేది ప్రాథమిక అంచనా. ఉత్తర భాగం…. సంగారెడ్డి నుంచి మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, యాదాద్రి మీదుగా చౌటుప్పల్ వరకు.. సుమారు 160 కిలోమీటర్లు ఉంటుంది. దక్షిణ భాగం చూస్తే…. సంగారెడ్డి నుంచి కంది,నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు దాదాపు 182 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉండనుంది.(Image Source From Twitter)
ఇతర గ్యాలరీలు