TRS Plenary In Pics | భాగ్యనగరం గులాబీ మయం.. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం-trs plenary 2022 full photos see here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Trs Plenary In Pics | భాగ్యనగరం గులాబీ మయం.. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం

TRS Plenary In Pics | భాగ్యనగరం గులాబీ మయం.. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం

Apr 27, 2022, 01:33 PM IST HT Telugu Desk
Apr 27, 2022, 01:31 PM , IST

  • హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదికగా తలపెట్టిన టీఆర్ఎస్ ప్లీనర్ లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ప్లీనరీ వేదికపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధితో పాటు జాతీయ అంశాలను ప్రస్తావించారు.

టీఆర్ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవం హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో ఘనంగా నిర్వహించారు.

(1 / 14)

టీఆర్ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవం హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో ఘనంగా నిర్వహించారు.

టీఆర్ఎస్ 2001లో ఆవిర్భవించినా ఇప్పటి వరకు 10 ప్లీనరీ నిర్వహించారు. కిందటి ఏడాది.. అక్టోబరులో జరిగిన పదో ప్లీనరీలో కేసీఆర్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవీకాలం రెండేళ్లపాటు ఉంటుంది.

(2 / 14)

ప్లీనరీ వేదిక వద్ద గులాబీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.

(3 / 14)

ఈ ప్లీనరీలో సుమారు 3వేలు పైగా టీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. గులాబీ నేత కె.కేశవరావు స్వాగత ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని ఉద్దేశించి ప్రసంగించారు.

(4 / 14)

అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని కేసీఆర్ అన్నారు. నిబ‌ద్ధమైన, సువ్యవ‌స్థీత‌మై కొలువుదీరిన పార్టీ టీఆర్ఎస్ అని కేసీఆర్ పేర్కొన్నారు.

(5 / 14)

రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు కేవలం టీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.

(6 / 14)

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట‌ అని.. ఎవ‌రూ కూడా బ‌ద్దలు కొట్టలేని కంచుకోట అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది ఒక వ్యక్తిదో, శ‌క్తిదో కాదని తెలంగాణ ప్రజ‌ల ఆస్తి అని వెల్లడించారు.

(7 / 14)

రాష్ట్ర సాధనలో అనేక ఒడుదొడుకులు, అవమానాలు ఎదుర్కొన్నామని కేసీఆర్ చెప్పారు. ఎన్నో ఛాత్కారాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.

(8 / 14)

దేశానికి రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనేక ప‌ద్ధతుల్లో వెలువ‌రిస్తున్న ఫ‌లితాలు, అవార్డులు, రివార్డులే మ‌న ప‌నితీరుకు నిదర్శనమని చెప్పారు.

(9 / 14)

అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని, పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేసుకుంటే మరింత సస్యశ్యామలమవుతుందన్నారు.

(10 / 14)

అంకితభావంతో పనిచేసినందుకే రాష్ట్రంలో నేడు విద్యుత్‌ సమస్య లేదని చెప్పారు. ఎందరో మహానుభావులు, పార్టీ శ్రేణుల కష్టమే తెరాసకు ఈ విజయాలన్నారు. కర్ణాటకలో అవినీతికి పాల్పడి ఒకరు మంత్రి పదవి కోల్పోయారన్నారు.

(11 / 14)

కర్ణాటక తరహా పరిస్థితి తెలంగాణలో లేదని కేసీఆర్ పునరుద్ఘాటించారు. పలు పెద్ద రాష్ట్రాలను అధిగమించి మన తలసరి ఆదాయం రూ.2,78,000గా ఉందన్నారు.

(12 / 14)

జీరో ఫ్లోరైడ్‌ రాష్ట్రంగా తెలంగాణను నిలిపామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా చేసుకున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు 3 ప్రభుత్వ వైద్యశాలలుంటే ఇప్పుడు 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

(13 / 14)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు