OTT Thrillers: బ్రెయిన్‌కు పని చెప్పే టాప్ 6 ఓటీటీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇవే.. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేరు!
Top 6 OTT Psychological Thriller Movies: ఓటీటీ సినిమాల్లో సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ మరింత స్పెషల్‌గా ఉంటాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాలు బ్రెయిన్‌కు పని పెడతాయి. చివరి వరకు సస్పెన్సింగ్‌గా సాగే టాప్ 6 ఓటీటీ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలపై లుక్కేద్దాం.
(1 / 7)
చివరి వరకు సస్పెన్స్‌గా, ఎవరి మనసునైనా కదిలించే, మన బ్రెయిన్‌కు పదును పెట్టే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారు ఈ ఓటీటీ థ్రిల్లర్ మూవీస్‌పై లుక్కేయండి.
(2 / 7)
సైకలాజికల్ థ్రిల్లర్స్ ఎవరి మనసునైనా కదిలించే విధంగా ఉంటాయి. ఇలాంటి సినిమాలు చూడటం మీకు ఇష్టమైతే తప్పకుండా ఒకసారి చూడాల్సిన అలాంటి కొన్ని సినిమాల పేర్లను ఇక్కడ సజెన్స్ పరంగా తెలియజేశాం. వీటిలో ఫైట్ క్లబ్ ఒకటి. అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీకి 8.8 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉంది.
(3 / 7)
ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ అనేది 1991 క్రైమ్ థ్రిల్లర్ సైకలాజికల్ చిత్రం. దీనిలో ఎఫ్‌బీఐ ఏజెంట్ మహిళలను వేటాడే ఒక నేరస్థుడి కథగా సాగుతుంది. దీనికి 8.6 ఐఎమ్‌డీపీ రేటింగ్ ఉంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడవచ్చు.
(4 / 7)
2014లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇంటర్ స్టెల్లార్. ఇందులో నాసా మాజీ పైలట్ తన బృందంతో ఒక కొత్త గ్రహాన్ని కనుగొంటాడు. ఆ తర్వాత ఏర్పడిని పరిస్థితుల కథాంశంగా ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రానికి IMDB రేటింగ్ 8.7 ఉంది. మీరు దీనిని నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూడవచ్చు.
(5 / 7)
సెవెన్ అనేది 1995 క్రైమ్ థ్రిల్లర్ సైకలాజికల్ చిత్రం. ఇందులో ఏడు అత్యాశలు గల మనుషులను భయంకరంగా చంపే క్రిమినల్‌ను పట్టుకునేందుకు ఇద్దరు డిటెక్టివ్ ప్రయత్నిస్తుంటారు. 8.6 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
(6 / 7)
2019లో వచ్చిన ఫ్యామిలీ సైకలాజికల్ డ్రామా మూవీ పారాసైట్. 2020లో ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఈ దక్షిణ కొరియా చిత్రానికి ఐఎమ్‌డీబీ రేటింగ్ 8.5 ఉంది. పారాసైట్ సోనీ లివ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు