తెలుగు న్యూస్ / ఫోటో /
OTT: పాపులర్ వెబ్ సిరీస్ ‘ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. టీజర్ రిలీజ్
- The Lord of The Rings: The Rings of Power Season 2 OTT: ఎంతో మంది ఎదురుచూస్తున్న ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ రెండో సీజన్ టీజర్ ట్రైలర్ వచ్చేసింది. అలాగే, స్ట్రీమింగ్ డేట్‍ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఖరారు చేసింది.

(1 / 5)
‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ వెబ్ సిరీస్ 'రెండో సీజన్' కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు. 2022లో వచ్చిన ఈ ఫ్యాంటసీ సిరీస్ తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు రెండో సీజన్ వచ్చేస్తోంది. సారూన్ పాత్రను పరిచయం చేస్తూ నేడు టీజర్ ట్రైలర్ వచ్చింది.
(2 / 5)
చార్లీ వికెర్స్ పోషిస్తున్నసారన్ శక్తులను చూపిస్తూ ఈ టీజర్ సాగింది. గలాడ్రియెల్, ఎల్‍రోన్డ్, ప్రిన్స్ డ్యూరిన్, అరోండిన్ సహా మరిన్ని పాత్రలు కూడా ఈ టీజర్‌లో ఉన్నాయి. అద్బుతమైన విజువల్స్, గ్రాఫిక్స్‌తో ఉన్న టీజర్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.
(3 / 5)
‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్‍ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన ఈ సీజన్ స్ట్రీమింగ్‍కు రానుంది.
(4 / 5)
‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ సీజన్ 2 ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఆగస్టు 29వ తేదీన ఈ సీజన్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.
ఇతర గ్యాలరీలు