Tirumala Brahmotsavalu: నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. విద్యుత్‌ కాంతులతో ధగధగలాడుతున్న తిరుమల గిరులు-the hills of tirumala are ablaze with electric lights brahmotsavam will start ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Brahmotsavalu: నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. విద్యుత్‌ కాంతులతో ధగధగలాడుతున్న తిరుమల గిరులు

Tirumala Brahmotsavalu: నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. విద్యుత్‌ కాంతులతో ధగధగలాడుతున్న తిరుమల గిరులు

Oct 03, 2024, 04:30 AM IST Bolleddu Sarath Chandra
Oct 03, 2024, 04:30 AM , IST

  • Tirumala Brahmotsavalu: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా  అక్టోబర్ 3న  బ్రహ్మోత్సవ అంకురార్పణం చేపడతారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఉత్సవాలు విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు. 

బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు.

(1 / 11)

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్న దృష్ట్యా, అక్టోబ‌రు 03 రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. 

(2 / 11)

అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది.  అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. సాధారణంగా సాయంత్రం వేళలో అంకురార్పణాన్ని నిర్వహిస్తారు. సత్యకారుడైన చంద్రుని కాంతిలో ఈ బీజాలు మొలకెత్తుతాయి.ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి అన్నది నమ్మకం.

(3 / 11)

 బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు.

(4 / 11)

శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు నిర్వహించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి బుధవారం డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.

(5 / 11)

అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.ఈ  ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక  బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అవుతుంది. బ్ర‌హ్మోత్సవాలతో తిరుమల శ్రీవారి ఆలయం విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. 

(6 / 11)

 అక్టోబర్ 4 : శుక్రవారం సాయంత్రం 5:45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధ్వజారోహణం ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం ఉంటుంది.అక్టోబర్ 5 : శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు చిన్నశేష వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హంస వాహన సేవ నిర్వహిస్తారు.అక్టోబర్ 6 : ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు సింహ వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ముత్యపుపందిరిలో స్వామివారు విహరిస్తారు.అక్టోబర్ 7 : సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు కల్పవృక్షం సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వ భూపాల సేవ నిర్వహిస్తారు. 

(7 / 11)

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గురు వారం సాయంత్రం అంకుర్పారణ జరుగుతుంది.  9 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 4 నుంచి 12 వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేసింది.అక్టోబర్‌ 3న అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.  ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య (అక్టోబర్ 4 మినహా) వాహన సేవలు ఉంటాయి. 

(8 / 11)

శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 4వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకం

(9 / 11)

అక్టోబర్ 8 : మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహన సేవ ఉంటుంది.అక్టోబర్ 9: బుధవారం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గజవాహన సేవ నిర్వహిస్తారు.

(10 / 11)

అక్టోబర్ 10 : గురువారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది.అక్టోబర్ 11 : శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రథోత్సవం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ ఉంటుంది.ఇక అక్టోబర్ 12వ తేదీన చక్నస్నానం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల ఈ క్రతువు జరుగుతుంది. ఇక అదే రోజు రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

(11 / 11)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు