Independence Day: దేశభక్తి కథలతో తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?
Independence Day: దేశభక్తిని చాటిచెప్పే కథాంశాలతో తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాలొచ్చాయి. దేశం కోసం ప్రాణాలను అర్పించిన పోరాట యోధుల కథలను వెండితెరపై స్టార్ హీరోలు స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారు. దేశభక్తి ప్రధానంగా తెలుగులో వచ్చిన కొన్ని బెస్ట్ మూవీస్‌ను ఏ ఓటీటీలో చూడాలంటే?
(1 / 6)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బ్రిటీషర్లను ఎదురించిపోరాడిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఇందులో విజయ్ సేతుపతి, అమితాబ్‌బచ్చన్, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటించారు.
(2 / 6)
అడివిశేష్ హీరోగా నటించిన మేజర్ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. 2008 ముంబై టెర్రరిస్ట్‌ల ఎటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం జీవితంతో అడివిశేష్ ఈ మూవీని చేశాడు.
(3 / 6)
ఇండిపెండెన్స్ డే అనగానే అందరికి తప్పకుండా గుర్తొచ్చె తెలుగు మూవీ ఖడ్గం. దేశభక్తి ని సందేశాత్మక కోణంలో చాటిచెబుతూ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ మూవీ కమర్షియల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ హీరోలుగా నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్‌లో చూడొచ్చు.
(4 / 6)
దేశానికి స్వాతంత్య్రంసాధించి పెట్టిన గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను చాటిచెబుతూ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన మహాత్మ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. మహాత్మ మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
(5 / 6)
కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషనల్‌లో 1996లో వచ్చిన భారతీయుడు మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. సమాజంలోని అవినీతి, లంచగొండితనంపై ఓ స్వాతంత్య్ర సమరయోధుడు ఎలాంటి పోరాటం సాగించాడన్నదే ఈ మూవీ కథ.
ఇతర గ్యాలరీలు