తెలుగు న్యూస్ / ఫోటో /
2024 రెండో సూర్యగ్రహణం నుంచి ఈ రాశులవారి టైమ్ స్టార్ట్ అవుతుంది.. అదృష్టమంతా వీరిదే!
Surya Grahan 2024 Lucky Rashi : 2024 రెండో సూర్యగ్రహణం రోజు నుంచి 3 రాశుల వారి భవితవ్యం మెరుగుపడనుంది. మరి ఆ అదృష్టం పొందే రాశులవారు ఎవరో తెలుసుకోండి..
(1 / 5)
2024 సూర్యగ్రహణం మహాలయ రోజున వస్తుంది. అయితే అక్టోబర్ 2న మహాలయ రోజున ఈ గ్రహణం రాత్రి పడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ గ్రహణం అనేక రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అదృష్టం ఎవరికి దక్కుతుందో చూద్దాం..?
(2 / 5)
భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2న సూర్యగ్రహణం రాత్రి వేళల్లో ఏర్పడనుంది. ఆ రోజు ఈ గ్రహణం 6 గంటల 4 నిమిషాల పాటు ఉంటుంది. దీని వల్ల అనేక రాశుల వారికి లాభాల ముఖం కనిపించబోతోంది.
(3 / 5)
వృషభం : వీరికి సంపాదనలో కొత్త మార్గాలు ఉంటాయి. నాయకత్వం వహించే సామర్థ్యం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆఫీసులో మీ కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో నూతన మార్గాలు ఏర్పడతాయి. విద్యార్థులు విద్యారంగంలో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించవచ్చు.
(4 / 5)
తులా రాశి : ఈ సమయంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఈ సమయంలో ఏ వ్యాపారమైనా లాభాలు పొందవచ్చు. విద్యార్థులకు పోటీ రంగంలో లాభాలు లభిస్తాయి. మీ వ్యక్తిగత జీవితం సంతోషం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. దాంపత్య జీవితంలో శృంగారం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
(5 / 5)
కుంభం : ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆశలు, ఉత్సాహం కలుగుతాయి. మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు బయటపడతాయి. లాభదాయకంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ( గమనిక : ఈ సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. సమాచారం అందించడం మాత్రమే మా ఉద్దేశం.)
ఇతర గ్యాలరీలు