(1 / 5)
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లలో ఆహారం కల్తీ ఎక్కువైపోతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా.. తీరు మారడం లేదు. కుళ్లిన మాంసం, కూరగాయలను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు.
(@cfs_telangana)(2 / 5)
చాలా ప్రముఖ హోటళ్లలో వంట గదులను మరుగుదొడ్డిలా ఉన్నాయి. తుప్పు పట్టిన పాత్రల్లోనే వంట వండుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగంలోని కొందరు అధికారులే ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. హోటళ్లు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
(@cfs_telangana)(3 / 5)
తాజాగా కొండాపూర్ శరత్ సిటీ మాల్‌లోని చెట్నీస్ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో వారు అవాక్కయ్యే దృశ్యాలు కనిపించాయి. కంది పప్పు డ్రమ్ములో బొద్దింకలున్నాయి. గోధుమపిండి, రవ్వకు పురుగులు పట్టాయి. ఫినాయిల్ డబ్బాలను కిరాణ సరకులను ఒకే చోట నిల్వ చేశారు.
(@cfs_telangana)(4 / 5)
వంట సామాన్లు పెట్టే గదిలో.. ఉల్లిపాయలు, క్యాబేజీ గడ్డలు కుళ్లిపోయాయి. టిఫిన్ సెంటర్‌లో చెత్త ఘోరంగా ఉంది. మూతల్లేని చెత్త డబ్బాలు ఉండటంతో.. ఈగలు, దోమలు ముసురుతున్నాయి.
(@cfs_telangana)(5 / 5)
ఫుడ్ సేఫ్టీ అధికారులు దాదాపు 500ల చోట్ల తనిఖీలు నిర్వహించగా.. 90 శాతం కేంద్రాల్లో లోపాలు బయటపడుతున్నాయి. దీంతో నగరవాసులు బయట తినాలంటే వణికిపోతున్నారు. ప్రముఖ హోటళ్లో పరిస్థితి కూడా మరీ దారుణంగా తయారైంది.
(@cfs_telangana)ఇతర గ్యాలరీలు