తెలుగు న్యూస్ / ఫోటో /
Stomach Bloating: ఇలాంటి ఆహారాలు ఒక్కోసారి పొట్ట ఉబ్బరానికి కారణమవుతాయి
- కొన్ని ఆహారాలు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. కానీ అవే ఒక్కోసారి పొట్ట ఉబ్బరానికి కారణం అవుతాయి. కాబట్టి పొట్ట ఇబ్బందిగా అనిపించినప్పుడు ఈ ఆహారాలను కొన్ని రోజులు దూరం పెట్టండి.
- కొన్ని ఆహారాలు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. కానీ అవే ఒక్కోసారి పొట్ట ఉబ్బరానికి కారణం అవుతాయి. కాబట్టి పొట్ట ఇబ్బందిగా అనిపించినప్పుడు ఈ ఆహారాలను కొన్ని రోజులు దూరం పెట్టండి.
(1 / 6)
పొట్టలో గ్యాస్ పెరగడం సర్వసాధారణం, ఇది ఒక్కోసారి చాలా నొప్పి పెడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా కూడా ఒక్కోసారి పొట్ట ఉబ్బరం వస్తుంది. అలాంటి ఆహారాలు కొన్ని ఇక్కడ ఇచ్చాము. వీటిని తినేటప్పుడు తక్కువగా తింటే మంచిది.
(2 / 6)
పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి.గా అయితే కొన్ని పండ్లు తిన్న తర్వాత కడుపులో గ్యాస్ పుడుతుంది. ఆపిల్, పియర్స్, పుచ్చకాయలు, బెర్రీలు తరచుగా ఉబ్బరం కలిగించే పండ్లు. వాటిని ఒకేసారి అధికంగా తినవద్దు.
(3 / 6)
చాలా మందిలో లాక్టోస్ అసహనం అనే సమస్య ఉంటుంది. అంటే పాల ఉత్పత్తుల్లో ఉండే లాక్టోస్ అరిగించుకునే శక్తి కొంతమందికి ఉండదు. పొట్ట ఉబ్బరం మొదలవుతుంది.
(4 / 6)
బీన్స్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శాఖాహారులు ప్రతిరోజూ వీటిని తినాల్సిన అవసరం ఉంది. అయితే వీటిలో జీర్ణక్రియకు అంతరాయం కలిగించే ప్రత్యేక సమ్మేళనాలు ఉన్నాయి. అందుకే పొట్ట ఉబ్బరం వంటివి వస్తూ ఉంటాయి.
ఇతర గ్యాలరీలు