తెలుగు న్యూస్ / ఫోటో /
Sri Rama Pattabhishekam : నేత్రపర్వం... రామయ్య పట్టాభిషేకం
- Sri Rama Pattabhishekam at Bhadrachalam: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రమూర్తి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం అత్యంత వైభవంగా సాగింది. శ్రీరాముడి పట్టాభిషేక వేడుకలకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై దంపతులు హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

(1 / 6)
భద్రాచలం మిధిలా స్టేడియంలో రామయ్య పుష్కర పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని వివిధ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి రుత్వికులు తీసుకొచ్చిన 12 నది జలాలతో స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించారు.
(2 / 6)
తొలుత ప్రధానాలయంలో స్వామివారిని కల్పవృక్షవాహనంపై వూరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత సామూహిక పారాయణం, హోమాలు చేశారు.
(3 / 6)
రామయ్య పుష్కర పట్టాభిషేక కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. భద్రాద్రిలో జరుగుతున్న వేడుకలకు వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్‌లు హాజరయ్యారు. రాములోరి పట్టాభిషేకం తర్వాత గవర్నర్ పర్నశాలను సందర్శిస్తారు
(4 / 6)
ప్రతి ఏడాది సీతారాముల కల్యాణం మరుసటి రోజు శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతోంది. ఈ పట్టాభిషేకాన్ని పూర్వం 60 ఏళ్లకోసారి జరిపేవారు. కాలక్రమేనా భక్తుల సౌకర్యార్థం పట్టాభిషేకంలో మార్పులు చేసి 12 ఏళ్లకోసారి నిర్వహిస్తున్నారు.
(5 / 6)
చివరిసారి 2011లో పట్టాభిషేకాన్ని నిర్వహించారు. సీతారాముల ఉత్సవాలకు సంబంధించి భద్రాచలంలో నిర్వహించే ఆచారాలనే దేశవ్యాప్తంగా అమలవుతోంది.
ఇతర గ్యాలరీలు