Sreeleela: నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు - ఎవరితో డేటింగ్‌లో లేను - శ్రీలీల కామెంట్స్
Sreeleela: డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు సినిమాలు చేస్తోంది. చదువు, సినిమాల కారణంగా ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే టైమ్ తనకు లేదంటూ కామెంట్స్ చేసింది.
(1 / 5)
సోషల్ మీడియాలో శ్రీలీల యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది శ్రీలీల.
(2 / 5)
మీరు ప్రేమలో ఉన్నారా అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తనకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరని, ఎవరితో డేటింగ్‌లో లేనని శ్రీలీల బదులిచ్చింది.
(3 / 5)
కొన్నాళ్లు పాటు సినిమాలు, చదువుపైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అప్పటివరకు ప్రేమ, పెళ్లి లాంటి బంధాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు శ్రీలీల చెప్పింది.
(4 / 5)
ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది శ్రీలీల. నితిన్ రాబిన్‌హుడ్‌తో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌లో నటిస్తోంది. ధమాకా తర్వాత రవితేజతో మరో మూవీ చేయనుంది.
ఇతర గ్యాలరీలు