తెలుగు న్యూస్ / ఫోటో /
Skywalk at Uppal : సరికొత్తగా ఉప్పల్ జంక్షన్.. వందేళ్లు వర్ధిల్లే 'పాదచారుల వంతెన'
- Skywalk at Uppal Junction Photos: దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టిన ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మంత్రి కేటీఆర్ ఆలోచనల్లో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్ట్... అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ఇందుకు సంబంధించిన పలు వివరాలు ఇక్కడ చూడండి....
- Skywalk at Uppal Junction Photos: దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టిన ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మంత్రి కేటీఆర్ ఆలోచనల్లో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్ట్... అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ఇందుకు సంబంధించిన పలు వివరాలు ఇక్కడ చూడండి....
(1 / 7)
ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను ప్రజానీకానికి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి.
(2 / 7)
రాబోయే వంద సంవత్సరాలకుపైగా ప్రజానీకం సౌకర్యార్థం మనుగడలో ఉండే లక్ష్యంతో పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు) రూపకల్పన జరిగింది. ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడకంతో పూర్తి చేశారు.
(3 / 7)
మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్ట్ కోసం అధికారులు లోతుగా కసరత్తు చేశారు. ఆర్కిటెక్చర్లు, డిజైనర్లు, సీనియర్ ఇంజనీర్ల బృందానికి బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండీఏ ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తోంది. ముఖ్యంగా ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే(రోడ్ క్రాసింగ్) సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాలలో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ ను నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం.
(4 / 7)
సుదీర్ఘకాలం మన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాదచారుల వంతెన నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL), వైజాగ్ స్టీల్ (విశాఖపట్నం) తోపాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్ ఉపయోగించడం జరిగింది.
(5 / 7)
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 37 పిల్లర్లు, 660 మీటర్ల పొడవు, మూడు(3), నాలుగు(4), అరు(6) మీటర్ల వెడల్పు కలిగిన ఉప్పల్ స్కైవాక్ భూమిపై నుండి అరు(6) మీటర్ల ఎత్తులో ఉంటుంది. మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్) బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు.
(6 / 7)
ఉప్పల్ చౌరస్తాలో నలువైపులా ప్రతినిత్యం సుమారు 20 వేలమందికిపైగా పాదచారులు అటు ఇటు రోడ్ క్రాసింగ్ చేస్తారని అంచనా. ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి రావడం ద్వారా కాలిబాటన రోడ్డు దాటే పాదచారులు స్కైవాక్ ను వినియోగించడం వల్ల ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ గా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగుతుంది.
(7 / 7)
ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్ ద్వారా ప్రతి రోజు సాధారణం సుమారు 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణీకుల రద్దీ ఉంటుంది. ఇకపైన ఉప్పల్ మెట్రో రైలు ప్రయాణీకులు మెట్రో కాన్ కోర్ (ఫ్లోర్) నుంచి పాదచారుల వంతెన (స్కై వాక్) మీదుగా వారి అవసరాలకు అనుగుణంగా వారి వారి గమ్య స్థానాలవైపు వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. లిఫ్టులు, మెట్ల మార్గాల పరిసరాల్లో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం మొక్కలు పచ్చిక బయలతో పచ్చదనాన్ని (గ్రీనరీ) పెంచుతుంది.
ఇతర గ్యాలరీలు