(1 / 6)
తల్లిదండ్రులు మన బాల్యాన్ని , మన భవిష్యత్తును కూడా రూపొందిస్తారు. ఆరోగ్యకరంగా, మానసికంగా పరిణతితో ఉండే పేరేంట్స్ తమ పిల్లలకు మంచి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చి గొప్ప వయోజనులుగా తీర్చిదిద్దుతారు. థెరపిస్ట్ అల్లిసన్ కెల్లమ్-అగ్యురే మానసికంగా పరిణతి చెందిన తల్లిదండ్రులకు సంబంధించిన కొన్ని సంకేతాలు తెలిపారు.
(Unsplash)
(2 / 6)
మానసికంగా పరిణతి చెందిన తల్లిదండ్రులు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటారు , మనకే అన్నీ తెలిసి ఉండాలి అనే వైఖరిని కలిగి ఉండరు. వారిని అర్థం చేసుకొని మరింత చేరువవుతారు.
(Unsplash)
(3 / 6)
వారు తమ పిల్లలను గౌరవిస్తారు, ఏమి చేసినా వారికి మద్దతు ఇస్తారు. మంచి పనికి ప్రశంసలు ఇస్తారు.
(Unsplash)
(4 / 6)
వారి భావోద్వేగాలను ఎలా పంచుకోవాలో వారికి తెలుసు, పిల్లలపై సానుభూతి కలిగి ఉంటారు. వారు తమ పిల్లలకు వివిధ విషయాల పట్ల మంచి అవగాహన కల్పిస్తారు.
(Unsplash)
(5 / 6)
ప్రతి బిడ్డ భిన్నంగా ఉంటారని వారు అర్థం చేసుకుంటారు. తమ బిడ్డ సామర్థ్యాన్ని గౌరవిస్తారు. దేనికీ ఒత్తిడి చేయరు.
(Unsplash)
(6 / 6)
వారి ప్రేమాభిమానాలకు షరతులు ఉండవు, ఏం చేసినా తమ పిల్లలకు అపారమైన ప్రేమను ఇస్తారు.
(Unsplash)ఇతర గ్యాలరీలు