తెలుగు న్యూస్ / ఫోటో /
Shilpa Shetty: అతను నన్ను వాడుకున్నాడు, మోసం చేశాడు.. స్టార్ హీరోపై శిల్పా శెట్టిపై షాకింగ్ కామెంట్స్
Shilpa Shetty Akshay Kumar Relationship: జూన్ 8న బాలీవుడ్ ఫిట్నెస్ బ్యూటి శిల్పా శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా స్టార్ హీరో అక్షయ్ కుమార్తో శిల్పా శెట్టి లవ్ రిలేషన్షిప్, పలు వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..
(1 / 5)
90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శిల్పా శెట్టి ఇప్పుడు 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఫిట్ నెస్, అందంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ఈ రోజు జూన్ 8న శిల్పాశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..
(2 / 5)
1990వ దశకంలో శిల్పా శెట్టి, స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇద్దరూ లవ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 1994లో విడుదలైన 'మై ఖిలాడి తు అనాది'లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత అక్షయ్, శిల్పాల ఎఫైర్ గురించి చాలా చర్చలు జరిగాయి. అయితే 2000లో వారు విడిపోయారు. అక్షయ్ 2001లో నటి ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నారు.
(3 / 5)
ఇదిలా ఉంటే, ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ తో ఎఫైర్ గురించి శిల్పాను కొన్ని ప్రశ్నలు అడిగారు. తొలిసారిగా ఆమె దానిపై స్టేట్ మెంట్ ఇచ్చింది. అక్షయ్ శిల్పాతో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అతను ట్వింకిల్ ఖన్నాతో డేటింగ్ చేశాడని శిల్పా వెల్లడించింది.
(4 / 5)
అక్షయ్ తో ఎఫైర్ గురించి చెబుతూ శిల్పా కన్నీటి పర్యంతమైంది. 'అక్షయ్ నన్ను వాడుకున్నాడు. మేమిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నాం. కానీ అతని జీవితంలోకి మరో నటి వచ్చినప్పుడు నన్ను వదిలేశాడు.. అతను మోసం చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది' అని శిల్పా చెబుతూ కన్నీటిపర్యంతం అయింది.
ఇతర గ్యాలరీలు