Hyderabad Hotels : రెస్టారెంట్లలో ఫుడ్ కోసం ఎగబడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ ఫొటోలు చూడండి
- Hyderabad Hotels : తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లోని రెస్టారెంట్లపై వరుస దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారీ, ఎక్స్ పైరీ అయిన వస్తువులు, ఫుడ్ కలర్స్ , నిబంధనల ఉల్లంఘనలను బయటపడుతున్నాయి.
- Hyderabad Hotels : తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లోని రెస్టారెంట్లపై వరుస దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారీ, ఎక్స్ పైరీ అయిన వస్తువులు, ఫుడ్ కలర్స్ , నిబంధనల ఉల్లంఘనలను బయటపడుతున్నాయి.
(1 / 6)
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లోని రెస్టారెంట్లపై వరుస దాడులు చేస్తున్నారు. శుక్రవారం శంషాబాద్ పరిధిలోని ఎస్ బావర్చి, ఎయిర్ పోర్ట్ బావర్చి, హోటల్ హైదరాబాద్ గ్రాండ్ రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారీ, ఎక్స్ పైరీ అయిన వస్తువులు, ఫుడ్ కలర్స్ , నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు.
(2 / 6)
శంషాబాద్ ఎస్ బావర్చి రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో FSSAI లైసెన్స్ కాపీ హోటల్ లో ప్రదర్శించలేదని అధికారులు గుర్తించారు. వినియోగదారులకు అందిస్తున్న తాగునీటి అపరిశుభ్రంగా ఉందని గుర్తించారు.
(3 / 6)
హోటల్ స్టోర్ రూమ్‌లో సింథటిక్ ఫుడ్ కలర్‌లు దొరికాయి. సెమీ ప్రిపేర్డ్, లేబుల్ లేని ముడి ఆహారపదార్థాలను లభించాయి. హోటల్ కిచెన్, స్టోర్ రూమ్ నేలపై ఎలుకల మలం గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కిటికీలకు కీటకాలు రాకుండా తెరలు అమర్చలేదు. పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు.
(4 / 6)
ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం నిన్న శంషాబాద్ ప్రాంతంలోని ఎయిర్ పోర్టు బావర్చి రెస్టారెంట్ లో తనిఖీలు చేసింది. పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు నిర్వాహకుల వద్ద అందుబాటులో లేవని అధికారులు గుర్తించారు. కిచెన్ ఆవరణలో కీటకాలు రాకుండా స్క్రీన్‌లు అమర్చబడలేదు. రిఫ్రిజిరేటర్‌లోని ఆహారపదార్థాలు, డిస్‌ప్లేలో ఉంచిన బ్రెడ్ బన్‌లో లేబుల్ లేవని అధికారులు తెలిపారు.
(5 / 6)
ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం శంషాబాద్ పరిధిలోని హోటల్ హైదరాబాద్ గ్రాండ్ లో తనిఖీలు చేశారు. ఈ హోటల్ లో FSSAI లైసెన్స్ కాపీ ప్రదర్శించలేదని గుర్తించారు. రెడ్ చిల్లీ సాస్, స్వీట్ చిల్లీ సాస్, కొబ్బరి పాలు, రోజ్ వాటర్, ఫిష్ మసాలా, థైమ్ వంటి ఆహార పదార్థాలు గడువు ముగిసినట్లు కనుగొన్నారు. డస్ట్ టీ (20 కిలోలు), BBQ సాస్ (2 కిలోలు) లేబులింగ్ ఉల్లంఘనలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
(6 / 6)
హోటల్ స్టోర్ రూమ్ లో సింథటిక్ ఫుడ్ కలర్‌లు గుర్తించి, వాటిని తొలగించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పాక్షికంగా తయారుచేసిన, నిల్వ చేసిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవని, నీటి విశ్లేషణ నివేదికలు అందుబాటులో లేవని కనుగొన్నారు. కిచెన్ లో అపరిశుభ్రవాతావరణాన్ని గుర్తించారు.
ఇతర గ్యాలరీలు