Multi Starrer Movies on OTT: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!-rrr to vikram vedha must watch multi starrer movies on ott amazon prime video disney plus hotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Multi Starrer Movies On Ott: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

Multi Starrer Movies on OTT: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

May 07, 2024, 10:24 AM IST Nelki Naresh Kumar
May 07, 2024, 10:24 AM , IST

Multi Starrer Movies on OTT: మ‌ల్టీస్టార‌ర్ మూవీస్‌తో ట్రెండ్‌, టైమ్‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంటాయి. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన కొన్ని మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్ పరంగా రికార్డలను తిరగరాశాయి. సౌత్‌లో వ‌చ్చిన ఆ బెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ఏవంటే?

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌ను గెలుచుకున్న తొలి తెలుగు మూవీగా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్  మూవీని జీ5 తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ఆడియెన్స్ చూడొచ్చు.

(1 / 5)

మ‌హేష్‌బాబు, వెంక‌టేష్ హీరోలుగా న‌టించిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఈటీవీ విన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీని దిల్‌రాజు ప్రొడ్యూస్ చేశాడు. 

(2 / 5)

తెలుగులో అగ్ర క‌థానాయ‌కులైన ప‌వ‌న్ క‌ళ్యాణ్, వెంక‌టేష్ క‌లిసి న‌టించిన గోపాల గోపాల మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.ఓ భ‌క్తుడికి దేవుడు ఎలా అండ‌గా నిలిచాడ‌నే పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది. 

(3 / 5)

మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి హీరోలుగా న‌టించిన విక్ర‌మ్ వేదా మూవీ బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టింది. పుష్క‌ర్‌గాయ‌త్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ బాలీవుడ్‌తో పాటు ప‌లు భాష‌ల్లో రీమేకైంది. విక్ర‌మ్ వేదా త‌మిళ్ వెర్ష‌న్‌ను జీ5 ఓటీటీలో చూడొచ్చు.హిందీ వెర్ష‌న్  జియో సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. 

(4 / 5)

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన విక్ర‌మ్ మూవీ త‌మిళంలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈమూవీలో విజ‌య్‌సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ ఇత‌ర హీరోలుగా క‌నిపించారు. ఈ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు