Kajal Aggarwal: ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లతో సల్మాన్ ఖాన్ రొమాన్స్ - ఒకే సినిమాలో కాజల్, రష్మిక మందన్న
టాలీవుడ్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న కలిసి ఓ బాలీవుడ్ మూవీలో అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. తొలిసారి ఈ ఇద్దరు హీరోయిన్ల కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతోంది.
(1 / 5)
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సికందర్ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ బాలీవుడ్ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
(2 / 5)
సికందర్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీలో మరో కథానాయికగా కాజల్ అగర్వాల్‌కు ఛాన్స్ దక్కినట్లు సమాచారం.
(3 / 5)
సికందర్ మూవీతో దాదాపు నాలుగేళ్ల తర్వాత కాజల్ బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. హిందీలో చివరగా 2021లో రిలీజైన ముంబై సాగాలో కాజల్ అగర్వాల్ కనిపించింది.
(4 / 5)
మంచు విష్ణు కన్నప్ప మూవీలో కాజల్ అగర్వాల్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నది. ఈ మూవీతో పాటు కమల్‌హాసన్, శంకర్ కాంబోలో ఇండియన్ 3 మూవీ చేసింది కాజల్.
ఇతర గ్యాలరీలు